Karnataka Politics: ఆవుల్ని వధిస్తే తప్పేంటన్న కర్ణాటక మంత్రి.. సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ ఏంటంటే?

రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు

Karnataka Politics: ఆవుల్ని వధిస్తే తప్పేంటన్న కర్ణాటక మంత్రి.. సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ ఏంటంటే?

CM Siddaramaiah

Cow Slaughter Remark: గేదెలను, దున్నపోతులను వధిస్తున్నప్పుడు ఆవులను వధిస్తే వచ్చిన ఇబ్బందేంటంటూ కర్ణాటక పశుసంవర్ధక మంత్రి కే. వెంకటేశ్ (Karnataka minister K Venkatesh) చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఈ బిల్లుపై క్యాబినెట్‭లో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా ఈ బిల్లుపై గత ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని, దానిపై చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు.

Odisha Train Smoke: ఒడిశాలో మరో ఘటన.. సికింద్రాబాద్-అగర్తలా రైలులో పొగలు

‘‘గతంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది. కానీ ఆ బిల్లులో గేదెలను, దున్నపోతులను వధించొచ్చని తెలిపారు. కానీ ఆవులను మాత్రమే వధించొద్దని పేర్కొన్నారు. ఇది ఏమాత్రం అవగాహన లేకుండా తీసుకువచ్చిందని చూస్తేనే అర్థమవుతోంది. దీనిపై మేము చర్చించి, ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.

Bihar bridge collapse: బ్రిడ్జి నిర్మాణ కంపెనీకి నోటీసులు పంపిన ప్రభుత్వం, హైకోర్టులో పిల్ దాఖలు

రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే గేదెలను, దున్నపోతులను వధిస్తున్నప్పుడు ఆవులను వధిస్తే వచ్చిన ఇబ్బందేంటంటూ ఆయన ప్రశ్నించారు.