Rahul Gandhi: నాకు కాబోయే భార్య వారిద్దరిలా ఉండాలి.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవితంలో బంధుత్వాలు సరిగాలేక కొందరు బాధపడుతుంటారు. అందుకే వారు ఎదుటివారిని దూషిస్తుంటారు అంటూ రాహుల్ తనను పప్పూ అంటూ విమర్శించే వారికి కౌంటర్ ఇచ్చారు.

Rahul Gandhi: నాకు కాబోయే భార్య వారిద్దరిలా ఉండాలి.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కొనసాగుతోంది. యాత్ర ఢిల్లీకి చేరుకుంది. అయితే, యాత్రకు తాత్కాలిక విరామం కావటంతో ఓ యూట్యూబ్ ఛానల్‌కు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై వచ్చే నిందలు, పప్పూ అంటూ ప్రత్యర్థులు చేసే విమర్శలపై స్పందించారు. అంతేకాదు.. తనకు ఎలాంటి భాగస్వామి కావాలి అనే విషయంపైనా రాహుల్ క్లారిటీ ఇచ్చారు.

Rahual Gandhi: బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ సలహా.. మండిపడుతున్న బీజేపీ శ్రేణులు.. ఎందుకంటే?

స్వశక్తితో నడిపించే సైక్లింగ్ అంటే తనకెంతో ఇష్టమన్న రాహుల్.. ఎన్‌ఫీల్డ్ నచ్చదన్నారు. నాకు ఆర్1 కంటే ఎక్కువగా ఓల్డ్ లాంబ్రెట్టా చాలా నచ్చుతుందని, లండన్‌లో పనిచేసే కాలంలో అప్రిలియా ఆర్ఎస్ 250 బైక్ ఉండేది. అదంటే నాకు ఎంతో ప్రేమ అని రాహుల్ తెలిపారు. కార్లపై కూడా మోజు లేదని, నాకు సొంతకారు కూడా లేదని, ఇంట్లో సీఆర్-వీ ఉన్నా.. అది అమ్మది అని రాహుల్ అన్నారు. అయితే, కార్లంటే ఇష్టం లేకపోయినా వాటిని రిపేర్ చేస్తానని రాహుల్ తెలిపారు.

Congress Party: భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుంది..? స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవితంలో బంధుత్వాలు సరిగాలేక కొందరు బాధపడుతుంటారు. అందుకే వారు ఎదుటివారిని దూషిస్తుంటారు అంటూ రాహుల్ తనను పప్పూ అంటూ విమర్శించే వారికి కౌంటర్ ఇచ్చారు. ఇక.. పెళ్లి ప్రస్తావనపైనా రాహుల్ స్పందించారు. నాకు కాబోయే భార్య నానమ్మ (మాజీ ప్రధాని ఇంధిరాగాంధీ) వంటి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదు. అమ్మ (సోనియా గాంధీ), నానమ్మలో ఉన్న విశ్రమ లక్షణాలు కలిగిన మహిళైతే మరీ మంచిది అంటూ రాహుల్ అన్నారు.