Prasanth Kishore : కాంగ్రెస్‌కు అది దేవుడిచ్చిన హక్కు కాదు.. రాహుల్‌ని టార్గెట్ చేసిన పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ మరోసారి కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెల‌ల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో

Prasanth Kishore :  కాంగ్రెస్‌కు అది దేవుడిచ్చిన హక్కు కాదు.. రాహుల్‌ని టార్గెట్ చేసిన పీకే

Pk

Prasanth Kishore :  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్ మరోసారి కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెల‌ల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో ప్ర‌శాంత్ కిషోర్ సుదీర్ఘ చ‌ర్చ‌లు నిర్వ‌హించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్లు కొందరు దీనిని వ్యతిరేకించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ప్రశాంత్​ కిశోర్​ కాంగ్రెస్​పై వరుస విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ మాదిరిగా కాంగ్రెస్ నాయకత్వంపై పీకే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పరోక్షంగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని విమర్శిస్తూ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు.

గురువార్ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ లో…”దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ ఉన్న స్థానం కీలకం. కానీ కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకించి ఓ వ్య‌క్తికే చెందిన‌ దైవ హ‌క్కు కాదు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో.. ప్రజాసామ్యయుతంగా నిర్ణయించాలి”అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో యూపీఏ అనేదే లేదు అని బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే పీకే ఇలా ట్వీట్​ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక, ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఆయన ట్వీట్​ను ట్యాగ్​ చేస్తూ కాంగ్రెస్​ ప్రతినిధి పవన్​ ఖేరా.. పీకేను సైద్ధాంతిక నిబద్ధత లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో పార్టీలకు ఆయన ఉచితంగా సలహాలు ఇవ్వొచ్చు కానీ.. మన రాజకీయాల అజెండాను ఆయన నిర్దేశించలేరని ఖేరా అన్నారు.

ALSO READ Congress : కాంగ్రెస్‌కి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి