Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర వంటి మరో యాత్ర ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్

అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ యాత్ర కూర్పు మాత్రం భారత్ జోడో యాత్రకు కాస్త భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇది మల్టీ మోడల్ యాత్ర అని, అయితే, చాలా వరకు పాదయాత్రే ఉంటుందని చెప్పారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర వంటి మరో యాత్ర ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్

AICC President election

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతం కావడంతో ఇప్పుడు అటువంటి మరో యాత్రను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర జరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను కశ్మీర్ లో ముగించారు.

లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. దీంతో ఈ సారి తూర్పు నుంచి పశ్చిమం వరకు ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ ముందు ప్రతిపాదన ఉంది. ఇప్పుడు దానికి ఆమోద ముద్ర వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల సమయానికి ఏయే కార్యక్రమాలు చేపట్టాలన్న విషయంపై కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టారు.

ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ యాత్ర కూర్పు మాత్రం భారత్ జోడో యాత్రకు కాస్త భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇది మల్టీ మోడల్ యాత్ర అని, అయితే, చాలా వరకు పాదయాత్రే ఉంటుందని చెప్పారు.

Maharashtra: దేవేంద్ర ఫడ్నవీస్ అరెస్టుకు ఉద్ధవ్ ప్రభుత్వం కుట్ర.. ఆలస్యంగా వెలుగులోకి తెచ్చిన మహా సీఎం షిండే