Constitution Day : ఫ్యామిలీ పార్టీలను టార్గెట్ చేసిన మోదీ..కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..

వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్​లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని

Constitution Day : ఫ్యామిలీ పార్టీలను టార్గెట్ చేసిన మోదీ..కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా..

Modi (1)

PM Modi : వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్​లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించిన మోదీ..కాంగ్రెస్ ను ఉద్దేశించి పార్టీ ఫ‌ర్ ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్న‌ట్లుగా మారింద‌న్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రజలకు వారసత్య రాజకీయాల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువలను కోల్పోయాయని మోదీ అన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయో చూడండి.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం అని మోదీ అన్నారు.

కుటుంబాల చేతుల్లో ఉండే పార్టీల గురించి ప్ర‌స్తావిస్తూ.. ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావ‌ద్దు అన్న ఆంక్ష‌లు ఏవీ లేవ‌న్నారు. యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎంద‌రు ఉన్నా.. ప్ర‌జ‌ల దీవ‌నెలు ఉంటే.. వారంతా పార్టీలో సేవ చేయ‌వ‌చ్చు అన్నారు. కానీ ఒక పార్టీని ఓకే కుటుంబం తరతరాలుగా నడిపించడం, పార్టీ వ్యవస్థ మొత్తం కుటుంబానికే పరిమితం కావడం ప్రజాస్వామ్యానికి అతి పెద్ద సమస్య అని అన్నారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని1950 తర్వాత ప్రతి ఏటా నిర్వహించాల్సిందని.. కానీ కొంతమంది అలా చేయలేదని చెప్పారు. మనం చేసే పని సరైనదా? కాదా? అని విశ్లేషించుకోవడానికి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరపాలని సూచించారు. ఎంతో మంది మేధావులు తమ మెదడుకు పదునుపెట్టి, అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్నిరూపొందించారని ప్రధాని గుర్తు చేశారు. ఇక, 2008లో ముంబైలో ఉగ్రవాదుల మారణ హోమం కూడా ఇదే రోజు జరిగిందని మోదీ గుర్తు చేశారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించారు

కాగా, ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగాంగానే పార్లమెంటు సెంట్రల్​ హాల్​లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లాతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ Covid New Variant : ఇజ్రాయెల్ లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు