Covid-19: కరోనా కాటు.. కుటుంబంలో ఇద్దరే మిగిలారు.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.

Covid-19: కరోనా కాటు.. కుటుంబంలో ఇద్దరే మిగిలారు.

Corona

Covid-19: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. కాగా రాష్ట్రంలోని కాంగ్రా జిల్లా పాలంపూర్ లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ భర్త కరోనాతో మృతి చెందాడు.

ఆమె కుమారుడు కూడా కరోనాతో కన్ను మూశాడు. దీంతో ఇంట్లో అత్తాకోడలు ఇద్దరే మిగిలారు. ఈ సంద‌ర్భంగా ఆ ఇంటి మ‌హిళ సంతోషి మాట్లాడుతూ తన భర్త క‌రోనా బారిన ప‌డ్డాక టాండా మెడికల్ కాలేజీలో ఏడు రోజుల పాటు చికిత్స పొందిన త‌రువాత మృతి చెందార‌ని తెలిపారు. త‌మ కుమారుడు కుమారుడు అనిల్ గులేరియా (39) కూడా క‌రోనాతో బాధ‌ప‌డుతూ ధర్మశాల కోవిడ్ ఆసుపత్రిలో మృతి చెందాడ‌ని తెలిపారు.

సంపాదించేవారు ఇద్దరు మృతి చెందటంతో తాము దిక్కులేనివారమయ్యామని ఆమె వాపోయారు. కాగా గ్రామాల్లో వైద్య స‌దుపాయాలు లేనందునే ఇటువంటి ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి