Corona Another Wave : అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ రాదు, ఎయిమ్స్ డైరెక్టర్

దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Corona Another Wave : అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ రాదు, ఎయిమ్స్ డైరెక్టర్

Corona Another Wave

Corona Another Wave : దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితులు, ఆక్సిజన్ కొరత, బెడ్స్ లభించకపోవడం, వైద్య పరికాల లేమి, రెమ్‌డెసివిర్, బ్లాక్ ఫంగస్‌లో ఉపయోగించే ఇంజక్షన్ల కొరత వంటి పరిస్థితులతో దేశ ప్రజానీకం విలవిలలాడారు. సరిగ్గా ఈ తరుణంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన సృష్టిస్తోంది.

కాగా, కరోనా థర్డ్ వేవ్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా థర్డ్ వేవ్… ప్రజలు వ్యవహరించే తీరు, వ్యాక్సిన్ ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. కరోనా నిబంధనలను పాటించడం, పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు ఇస్తే థర్డ్ వేవ్ వచ్చేందుకు ఆస్కారం ఉండదన్నారు. ఒకవేళ వచ్చినా ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. దేశంలో రోజువారీ కేసులు తగ్గుతున్నాయని గులేరియా తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, అక్కడ కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.

వ్యాక్సిన్లు మిక్సింగ్ పైనా గులేరియా స్పందించారు. దీనికి సంబంధించి మరింత డేటా అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్లు మిక్స్ చేయడం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదన్నారు. ఏది ఏమైనా పాలసీ చేసే ముందు మరింత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.