Delhi : మళ్లీ కరోనా ఆంక్షలు.. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్

ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్‌ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

Delhi : మళ్లీ కరోనా ఆంక్షలు.. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్

Delhi

Corona restrictions in Delhi : కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్‌లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ.. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2వేల 380 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్‌ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో కరోనా ఆంక్షలు మొదలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మాస్క్ పెట్టకపోతే 500 రూపాయలు ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ కార్లలో ప్రయాణించే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. స్కూళ్లలో కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులు, సిబ్బందికి థర్మల్ స్కానింగ్ తప్పనిసరి చేశారు. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ వస్తువులను పంచుకోకుండా విద్యార్థులపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Covid‌ Cases : దేశంలో మళ్లీ కోవిడ్‌ పంజా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

ఇక ఢిల్లీలో కరోనా కొత్త కేసులతో పాటు కొత్త వేరియంట్ కూడా కలకలం రేపుతోంది. కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ BA.2 వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ కేసులను గుర్తించారు. ఢిల్లీతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో కేసులు భారీగా పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరింత పరిశోధనలు చేస్తున్నామన్నారు. కొత్త వేరియంట్లపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.