India Corona Updates: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్‌కు సంకేతమా?

భారతదేశంలో కరోనా సంక్షోభం దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. తగ్గినట్లుగా అనిపించిన కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి.

India Corona Updates: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్‌కు సంకేతమా?

Corona Update

India Corona Updates: భారతదేశంలో కరోనా సంక్షోభం దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. కరోనా కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించగా.. లేటెస్ట్‌గా డేటాను పరిశీలిస్తే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో 37,593 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే సమయంలో 648మంది కరోనా సోకిన వారు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజు 25,467 కరోనా కేసులు వచ్చాయి.  గడిచిన 24 గంటల్లో 34వేల 169 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్నటి కంటే ఈరోజు 2,776 యాక్టివ్ కేసులు పెరిగాయి.
కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తం మూడు కోట్ల 25 లక్షల 12 వేల మందికి కరోనా సోకింది. వీరిలో 4 లక్షల 35 వేల 758 మంది చనిపోగా.. ఇప్పటివరకు 3 కోట్ల 17 లక్షల 54 వేల మంది కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చికిత్స పొందుతున్న మొత్తం 3 లక్షల 22వేల మంది ఇప్పటికీ కరోనా వైరస్ బారిన పడ్డారు.
మొత్తం కరోనా కేసులు – మూడు కోట్ల 25 లక్షల 12 వేల 366
కోలుకున్నవారు – మూడు కోట్ల 17 లక్షల 54 వేల 281మంది
మొత్తం యాక్టివ్ కేసులు – మూడు లక్షల 22 వేల 327మంది
మరణించినవారు – నాలుగు లక్షల 35 వేల 758మంది
వ్యాక్సినక వేయించుకున్నవారు – 59 కోట్ల 55 లక్షల 4వేల డోసులు
కేరళలో కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు రావడంతో, మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 38 లక్షల 51 వేల 984 కు పెరిగింది. మరో 173 మంది కరోనా కారణంగా మరణించగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 19,757కి చేరుకుంది. కేరళలో మే 26వ తేదీ తర్వాత ఒక రోజులో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 24వేలు దాటడం ఇది రెండోసారి. మే 26వ తేదీన, 28,798 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
59 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు:
దేశవ్యాప్తంగా ఆగస్టు 24వ తేదీ వరకు 59 కోట్ల 55 లక్షల 4 వేల మోతాదుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చివరి రోజు 61లక్షల 90వేల వ్యాక్సిన్లు వేయించుకున్నారు. అదే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, 51 కోట్ల 11 లక్షల కరోనా పరీక్షలు జరగగా.. చివరి రోజున దాదాపు 17.92 లక్షల కరోనా పరీక్షలు జరిగాయి, దీని పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉంది.
దేశంలో కరోనా మరణాల రేటు 1.34 శాతం కాగా, రికవరీ రేటు 97.68 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.98 శాతం. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 10 వ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత, బ్రెజిల్ భారతదేశంలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
కరోనా కేసులు తక్కువయ్యాక మళ్లీ ఒక్కసారిగా పెరగడంతో మూడో వేవ్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.