Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

India Corona

Coronavirus Update India : భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో…వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఐదు నెలల తర్వాత..అధికంగా కరోనా కొత్త కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దేశంలో కొత్తగా 7081 కరోనా పాజిటివ్ కేసులు, 264 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 83,913 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 0.24 శాతంగా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3,47,40,275 కేసులు, 4,77,422 మరణాలు సంభవించాయి. దేశంలో కరోన రికవరీ 98.38 శాతంగా ఉంది. కరోనా నుంచి 7,469 మంది
కోలుకున్నారు.ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,78,940గా ఉంది.

Read More : Omicron India : ఒమిక్రాన్ ఉధృతి, మహారాష్ట్రలో ఆంక్షలు..నూతన మార్గదర్శకాలు

మరోవైపు…ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. ఇప్పటివరకు 89 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న ప్రాంతాల్లో ఒకటిన్నర నుంచి మూడు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ ప్రమాదకరమైందని… అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. అందుకే ప్రపంచ దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈశాన్య ఆసియా డైరెక్టర్​పూనమ్​ఖేత్రపాల్ సింగ్ వ్యక్తిగత సంరక్షణతోపాటు ఒకరినొకరు సంరక్షించుకోవాలని… టీకాలు తప్పక తీసుకోవాలని కోరారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.