Couple Sells Infant: మగ శిశువును డాక్టర్‌కు అమ్మేసిన భార్యాభర్తలు

పుట్టిన మగ శిశువును డాక్టర్ కే అమ్మేశారు ఆ జంట. పుట్టేది మగ పిల్లాడైతే తనకు అమ్మేయాలంటూ డాక్టర్ ముందుగానే బేరం కుదుర్చుకోవడంతో అనుకున్నట్లుగానే రూ.లక్ష పుచ్చుకుని అప్పగించేశారు....

10TV Telugu News

Couple Sells Infant: పుట్టిన మగ శిశువును డాక్టర్ కే అమ్మేశారు ఆ జంట. పుట్టేది మగ పిల్లాడైతే తనకు అమ్మేయాలంటూ డాక్టర్ ముందుగానే బేరం కుదుర్చుకోవడంతో అనుకున్నట్లుగానే రూ.లక్ష పుచ్చుకుని అప్పగించేశారు. ఆ తర్వాత రియలైజ్ అయి బిడ్డకు తమకు కావాలంటూ డాక్టర్ ను అభ్యర్థించారు. ససేమిరా కుదరదని చెప్పడంతో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులను కలిశారు.

భార్యభర్తలైన పూజా అహిరె 28, సంతోశ్ అహిర్ 30లు దొంబ్విలీలో ఉంటున్నారు. కీటన్ సోనీ 34అనే హోమియోపతి డాక్టర్ ను కలిశారు. పూజా ప్రెగ్నెంట్ గా ఉందని తాము పేదవాళ్లం కాబట్టి ఎవరైనా ఆర్థిక స్థోమత ఎక్కువగా ఉన్న వారికి శిశువు బాధ్యతలు అప్పగిస్తే ఇంకా బాగా చూసుకుంటారనే ఉద్దేశ్యంతో అమ్ముకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

నవంబరు 10న మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత డాక్టర్ ను కలిసి అనుకున్నట్లుగానే ఒప్పందం పూర్తి చేసుకున్నారు. నవంబర్ 15న శిశువును డాక్టర్ కు అప్పగించారు. గణపతి టెంపుల్ సమీపంలో డబ్బులు కూడా అందుకున్నారు.

………………………………… : మొత్తానికి హాలీవుడ్ సినిమాని అనౌన్స్ చేసిన సమంత

నిర్ణయం మార్చుకున్న ఆ జంట.. మరోసారి డాక్టర్ ను కలిసి తమ బిడ్డను తిరిగిచ్చేయాలని ప్రాధేయపడ్డారు. అప్పటికే వాళ్లు సగం డబ్బు ఖర్చు చేసేశారు. డాక్టర్ ను బిడ్డను తిరిగి ఇవ్వనని మొండికేయడంతో సోషల్ వర్కర్ల సాయంతో, జిల్లా మహిళా శిశు సంరక్షణ శాఖను కలిశారు. వారి ముగ్గురిపైనా కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టారు.

బిడ్డను అతని నుంచి విడిపించి.. ఫ్యామిలీకి సాయం చేశారు డా. పల్లవి జాధవ్. అన్నీ డాక్యుమెంట్లు పరిశీలించి నిజాలు తెలుసుకోనున్నారు. డాక్టర్ గతంలో ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అని ఎంక్వైరీ చేస్తున్నారు.