Covid-19 case : దేశంలో సెకండ్ వేవ్ పీక్.. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి..

కోవిడ్ -19 వ్యాప్తి సెకండ్ వేవ్ భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో మొత్తంగా ధృవీకరించిన కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి25 మిలియన్లకు చేరింది. డేటా ప్రకారం.. గత వారంలో పీక్ కు చేరిన కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.

Covid-19 case : దేశంలో సెకండ్ వేవ్ పీక్.. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి..

Covid 19 Case Trajectory Shows Second Wave Is Ebbing (1)

Covid-19 case trajectory second wave : కోవిడ్ -19 వ్యాప్తి సెకండ్ వేవ్ భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో మొత్తంగా ధృవీకరించిన కరోనా కేసుల సంఖ్య ఆదివారం నాటికి25 మిలియన్లకు చేరింది. డేటా ప్రకారం.. గత వారంలో పీక్ కు చేరిన కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. రెండో వేవ్ ప్రారంభమైన తరువాత మొదటిసారిగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. కరోనా సెకండ్ వేవ్ ధాటికి మెడికల్ ఆక్సిజన్ సరఫరా కొరత, మందులు, ఆస్పత్రిలో బెడ్స్, అంబులెన్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కొవిడ్ -19 డేటా ప్రకారం.. దేశంలో మొత్తంగా 281,911 కొత్త కేసులు ఆదివారం నమోదయ్యాయి. 27 రోజులలో అతి తక్కువగా చెప్పవచ్చు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,964,718కు చేరింది. గత వారంలో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 328,947 కొత్త కేసులు నమోదైతే.. వారం క్రితం ఈ సంఖ్య 391,819గా నమోదైంది. గత ఏడు రోజులలో కొత్త కేసుల పాజిటివిటి రేటు 16శాతం తగ్గింది. ఏడు రోజుల సగటు కేసులను పరిశీలిస్తే.. దేశంలోని కోవిడ్ -19 కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది.

ఫిబ్రవరి ఆరంభం నుంచి మొదటిసారిగా వరుసగా ఏడు రోజులు తగ్గిపోయాయి. టెస్టులు చేసిన ఏడు రోజుల శాంపిల్స్ సగటు గత ఆదివారం నుంచి 3.6శాతం పెరిగింది. ఢిల్లీ గత వారంలో కొత్త కొవిడ్ కేసుల రేటులో అత్యధికంగా పడిపోయింది. ఏడు రోజుల రోజువారీ కేసులు గత వారంలో 18,374 నుంచి 10,043కు 45శాతం తగ్గాయి. ఢిల్లీలో కరోనా కేసులు జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ పడిపోయాయి. ఉత్తర ప్రదేశ్‌లో గత వారంలో ఏడు రోజుల సగటు కేసులు 39శాతం తగ్గాయి, ఈ సంఖ్య ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో 36శాతం, తెలంగాణలో 32శాతం తగ్గింది. ఆ తర్వాత జార్ఖండ్ లో సగటు రోజువారీ కేసులలో 30శాతం తగ్గింది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 27శాతం, 25శాతంగా ఉన్నాయి. మే 12న, దేశంలో కనీసం ఆరు ప్రాంతాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా కరోనా కేసుల తగ్గుదల ప్రారంభమైందని సంకేతాలు సూచిస్తున్నాయి. దేశంలో ఎక్కువ చోట్ల కొత్త కేసులు తగ్గుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ, తూర్పు, ఈశాన్యంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల సగటు కేసులు ఈశాన్యంలో ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయి. త్రిపురలో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 65శాతం పెరిగింది. మేఘాలయలో 58శాతం, మణిపూర్‌లో 37శాతం ఉన్నాయి.