COVID-19 vaccination: 18ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి..

COVID-19 vaccination: 18ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్

Covid 19 Vaccination

COVID-19 vaccination: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి 18ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ వేయాలని సూచించింది. రోజూ పెరుగుతున్న కేసుల ప్రభావంతో మూడో రోజూ పెరిగి 90వేలకు చేరాయని రికార్డులు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. మొత్తం కేసులు కోటి 26లక్షల 86వేల 49 ఉన్నట్లు వెల్లడించగా అందులో లక్షా 3వేల 558 కొత్త కేసులున్నాయని అధికారిక సమాచారం.

ప్రస్తుతం 45ఏళ్లు అంతకంటే పైబడ్డ వారందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని కూడా పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానికి లెటర్ లో కోరింది.

కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 18ఏళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సినే వేయాలని కోరాం. అందరికీ అందుబాటులో ఉచితంగా వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలని అడిగాం. ప్రైవేట్ సెక్టార్ ఫ్యామిలీ క్లినిక్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కలిపి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలి. అంతేకాకుండా పబ్లిక్ ప్లేస్ లలో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ప్రొడక్ట్స్ తీసుకునే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను తప్పనిసరి చేయాలి’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోడీని కోరింది.

సంక్షోభ సమయంలో ర్యాపిడ్ వ్యాక్సినేషన్ కోసం మ్యాన్ పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రొయాక్టివ్ సపోర్ట్ ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హామీ ఇచ్చింది.