COVID-19: కొవిడ్ అంతం అతి త్వరలోనే – యూఎస్ వైరాలజిస్ట్

వ్యాక్సినేషన్ చాలా బలమైన ఆయుధంగా పేర్కొంటూ.. ఇక కరోనా వైరస్ అంతమైపోతుందని అమెరికన్ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. వాషింగ్టన్ కు చెందిన డా. కుటుబ్ మహమూద్ వ్యాక్సిన్ సాయంతో ప్రజలు వైరస్ న

COVID-19: కొవిడ్ అంతం అతి త్వరలోనే – యూఎస్ వైరాలజిస్ట్

Covid 19 Vaccination

COVID-19: వ్యాక్సినేషన్ చాలా బలమైన ఆయుధంగా పేర్కొంటూ.. ఇక కరోనా వైరస్ అంతమైపోతుందని అమెరికన్ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. వాషింగ్టన్ కు చెందిన డా. కుటుబ్ మహమూద్ వ్యాక్సిన్ సాయంతో ప్రజలు వైరస్ ను ఎదుర్కొని గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

వైరస్, మనుషులపై మధ్య సారూప్యత గురించి చెబుతున్నా. వైరస్ పెరుగుతుంది. దాంతో పాటు మనం కూడా జాగ్రత్తలు పెంచుకుంటున్నాం. వ్యాక్సిన్లు, యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీబాడీస్ లాంటి ఆయుధాలతో పోరాడుతున్నాం’ అని అన్నారు.

సంవత్సర కాలంలో ఇండియా 60శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడంపై యూఎస్ వైరాలజిస్ట్ చాలా సాధించినట్లుగా పేర్కొన్నారు. కొత్త మ్యూటేషన్స్ పుట్టడంపై సైంటిఫిక్ కమ్యూనిటీ ఆశ్చర్యపడటం లేదని అన్నారు. భారత్ బయోటెక్ చేసిన కొవాగ్జిన్ ప్రొడక్ట్ చాలా ప్రత్యేకమైనదని 2సంవత్సరాల పిల్లల్లోనూ సేఫ్టీ పెంచగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: బూస్టింగ్ డోస్ తీసుకుంటేనే యాపిల్ ఉద్యోగులకు ఎంట్రీ

కొత్త కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం 14లక్షల 17వేల 820 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 68లక్షల 50వేల 962 ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.