Covid-19 : భారతీయులు హాస్పిటల్ కు పెట్టిన ఖర్చు రూ. 64 వేల కోట్లు

కరోనా సోకిన భారతీయులు హాస్పిటల్ కోసం చేసిన ఖర్చు రూ. 64 వేల కోట్లుగా ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ లెక్క ప్రభుత్వం నిర్ణయించిన ధరలను బట్టి లెక్కలోకి వచ్చింది. అదే లెక్కలోకి రాని కార్పొరేట్ హాస్పిటల్స్ రోగుల నుంచి రాబట్టిన మాత్రం లెక్కలోకి వస్తే ఇంకా ఎన్ని కోటాను కోట్లు ఉండి ఉంటాయో లెక్కేలేదు...

Covid-19 : భారతీయులు హాస్పిటల్ కు పెట్టిన ఖర్చు రూ. 64 వేల కోట్లు

Covid Payments In Hospitals

COVID hospitalisation expenses 7months income pay : కరోనా మహమ్మారి వల్ల కుటుంబాలకు కుటుంబాలే కూలిపోయాయి. భారత దేశ వ్యాప్తంగా కరోనా కలిగించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా సోకినవారు ప్రాణాలు దక్కించుకోవటం కోసం చికిత్సలు చేయించుకోవటానికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులకు నెట్టేసిందీ మహమ్మారి. అయినా దేశం వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాల ఛిన్నాభిన్నం అయిపోయాయి. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు..తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు అనాథలుగా మారారు. ఈ మహమ్మారి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటినిలోను ఇదే దుస్థితికి గురి చేసింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి దహన సంస్కారాలు చేయటానికి స్థలాలు కూడా కరువయ్యాయి అంటే దేశం ఎంతటి ప్రాణనష్టానికి గురైందో ఊహించుకోవచ్చు..కరోనా మృతుల శవ దహనాలతో దేవం రావణకాష్టంలా రగిలిపోయింది. చితిమంటలు రగులుతూనే ఉన్నాయి.

ఇటువంటి భయానక పరిస్థితుల్లో భారతీయులు కరోనానుంచి ప్రాణాలు దక్కించుకోవటానికి అప్పుల పాలయ్యారు. ఆస్తులు కూడా తెగనమ్ముకున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం వారి జీవితంలో కష్టపడిన జీతాలను ఖర్చుపెట్టేశారు. ఏడాదికి వారు సంపాదించుకున్న ఏడు నెలల జీతాలను..ఉపాధి ద్వారా వచ్చిన డబ్బును హాస్పిటల్ లో కోవిడ్ ఐసీయూ ఖర్చుల కోసం ఖర్చు పెట్టారని అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. ప్రతీ భారతీయుడు తమ 7 నెలల జీతాన్ని హాస్పిటల్ ఐసీయూ ఖర్చు పెట్టారని..భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్, డ్యూక్ గ్లోబల్ హెల్త్ సంస్థ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది. 2020లో ఏప్రిల్ నుంచి గత నెల అంటే జూన్ వరకు భారతీయులు ఏకంగా రూ. 64 వేల కోట్ల ఖర్చు పెట్టారని ఈ అధ్యయనంలో తేలింది. అదే దినసరి కూలీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారు 15 నెలల ఆదాయాన్ని ఖర్చు చేశారని అధ్యయనంలో తేలింది. ఇక్కడ గమనించాల్సని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రూ.64వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధల మేరకు వచ్చిన లెక్క ఇది..కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్ల నుంచి రాబట్టిన బిల్లులు లెక్కలోకి రాకుండానే ఇంత భారీ లెక్క వచ్చింది. మరి ఆ కార్పొరేట్ ఆసుపత్రులు గుంజిన డబ్బులు ఇంకా ఎన్ని వేల లక్షల కోట్లు..కోటాన కోట్లు ఉండి ఉంటాయో..

దేశంలో కరోనా మహమ్మారి బారినపడినవారు ఆసుపత్రుల్లో చేరి లక్షలాది రూపాయలు వదిలించుకున్నారు. ఇంకా వదిలించుకుంటునే ఉన్నారు. ఐసీయూ చికిత్స కోసం సగటు భారతీయుడు ఏకంగా ఏడు నెలల వేతనాన్ని ఖర్చు చేస్తున్నట్టు భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్, డ్యూక్ గ్లోబల్ హెల్త్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. అదే దినసరి కూలీలు అయితే 15 నెలల ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. అంతేకాదు కొవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం 14 నెలల్లో భారతీయులు ఏకంగా రూ. 64 వేల కోట్లను ఖర్చు చేసినట్టు అధ్యయనం నివేదికలో వెల్లడైంది.

కాగా భారత్ లో కరోనా మరణాలు లెక్కలేనన్ని సంభవించాయి. ఇంకా లెక్కకు రాని మరణాలు లక్షల్లో ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ మరణాల ఫలితంగా లక్షలాదిమంది పిల్లలు అనాధలుగా మారారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దేశం కరోనా కల్లోలంలో నిండిపోయింది. ఈ దారుణ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోకముందే ప్రస్తుతం కరోనా మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ అంటూ పరలు రకాలుగా ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తునే ఉంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.