Super Spreaders : కొంపముంచుతున్న బంధువులు.. తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణం కరోనా రోగుల బంధువులే?

తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ్ పేషెంట్ల బంధువులే కారణమా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.

Super Spreaders : కొంపముంచుతున్న బంధువులు.. తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణం కరోనా రోగుల బంధువులే?

Super Spreaders

Super Spreaders : తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ్ పేషెంట్ల బంధువులే కారణమా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.

తమిళనాడులో కరోనా కేసుల పెరుగుదలకు పేషెంట్ల బంధువులే కారణం అని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులకు పేషెంట్ల బంధువులను అనుమతిస్తున్నారు. పేషెంట్ల ఆరోగ్య సమాచారం, వారితో మాట్లాడటం, భోజనం అందచేసేందుకు ఆసుపత్రులకు వెళ్తున్నారు. అంతేకాదు కరోనా రోగుల బెడ్లపై కూర్చుంటున్నారు. ఆ తర్వాత వారు బయటకు వస్తున్నారు. వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది. కరోనా జాగ్రత్తలు పాటించినప్పటికి, 10శాతం కేసులు పేషెంట్ల బంధువులతోనే వ్యాపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

తమిళనాడులోని చాలా ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రోగుల బంధువులు పీపీఈ కిట్లు ధరించకుండానే ఆసుపత్రులకు వస్తున్నారు. పేషెంట్ల మధ్య కనీసం భౌతిక దూరంతో పాటు కోవిడ్ సేఫ్టీ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి బెడ్ పై వారి తరుఫు బంధువులు ఉంటున్నారు. అంతేకాదు పేషెంట్లతో మాట్లాడటం, ఫోన్ లో చాటింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ ఆసుపత్రిలోకి పేషెంట్లను తప్ప ఇతరులకు అనుమతి లేదు. కానీ, ఆసుపత్రుల దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రతి ఒక్కరిని లోనికి అనుమతిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికి, రోగుల బంధువులు మాత్రం పట్టించుకోవడం లేదు. భద్రతా మార్గదర్శకాల ఉల్లంఘనలతో ఫ్రంట్ లైన్ వర్కర్స్, అటెండర్లకు కూడా కరోనా సోకుతోంది. వీరు కూడా కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా మారుతున్నారు.

మరోవైపు తమిళనాడులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. కేవలం నలుగురు నర్సులు 10మందికిపైగా రోగులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా లాంటి సంక్షోభంలో ఓవైపు వర్క్ ప్రెజర్, మరోవైపు ఎక్కువ సమయం ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.