Vaccinations: కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ వేసుకున్నవారిలో ఎక్కువగా యాంటీబాడీస్!

కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్కువగా తయారైనట్లుగా అధ్యయనం చెబుతుంది.

Vaccinations: కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ వేసుకున్నవారిలో ఎక్కువగా యాంటీబాడీస్!

Covishield Produced More Antibodies Than Covaxin After First Dose Preliminary Study

Covishield Antibodies: కోవాగ్జిన్, కోవిషీల్డ్ దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇవి రెండే. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అనే అనుమానంలో ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్ వేసుకున్నవారి కంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎక్కువగా తయారైనట్లుగా అధ్యయనం చెబుతుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కోవాగ్జిన్‌తో పోలిస్తే కోవిషీల్డ్ గ్రహీతలలో యాంటీ-స్పైక్ యాంటీబాడీకి సెరోపోసిటివిటీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.

శరీరంలో వైరస్‌లకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కోవిషీల్డ్ మానవ శరీరంలో కోవాగ్జిన్ కంటే ఎక్కువ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుందని, కరోనా వైరస్‌ ప్రభావాన్ని అడ్డుకునే యాంటీ బాడీస్ ఎక్కువగా ఉన్నట్లుగా స్పష్టం చేసింది అధ్యయనం. ఈ పరిశోధనలో కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.

కోవాగ్జిన్‌తో పోల్చితే కోవిషీల్డ్ మొదటి మోతాదు తర్వాత శరీరంలో యాంటీబాడీ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, అయితే, ఇది క్లినికల్ ప్రాక్టీస్‌లో గుర్తించలేదని చెబుతున్నారు. కోవాగ్జిన్‌ అయినా, కోవిషీల్డ్ అయినా, రెండు టీకాలు కూడా కరోనా వైరస్‌పై పోరాటంలో మంచి ప్రభావాన్ని చూపుతున్నాయని అధ్యయనంలో చెప్పబడింది. ఏదైనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న తర్వాత వచ్చిన ఫలితాలు నమ్మదగినవి అని, 552 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో 325 మంది పురుషులు, 227 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 456 మందికి కోవిషీల్డ్, 96 మందికి కోవాగ్జిన్ ఫస్ట్ డోసు ఇచ్చినట్లుగా వెల్లడించారు. వీరిలో 79 శాతం మంది సెరా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.

ఈ పరిశోధనలో రెండు వ్యాక్సిన్లు వైరస్‌పై బలంగా పనిచేసినట్లు చెప్పారు. మేలో కూడా ఇదే విధమైన ప్రకటనను ఐసిఎంఆర్‌కు చెందిన డిజి బలరామ్ భార్గవ ఇచ్చారు. కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తరువాత, శరీరంలో యాంటీబాడీస్ స్థాయి వేగంగా పెరుగుతుందని, సెకండ్ డోస్ కోవాగ్జిన్ తీసుకున్న తరువాత, శరీరంలో యాంటీబాడీస్ స్థాయి పెరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా, ఇప్పటివరకు కోట్ల మంది కరోనా వైరస్ నుంచి రక్షణ పొందారని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ప్రభుత్వం కోవ్‌షీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 6-8 వారాల నుండి 12-16 వారాలకు పెంచింది. కోవిషీల్డ్ ఫస్ట్ డోసు కారణంగానే రోగనిరోధక శక్తి బలపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.