Cowin Portal : ఇక తెలుగులోనూ కరోనా టీకా రిజిస్ట్రేషన్

కరోనా టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ ఇప్పుడు హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.

Cowin Portal : ఇక తెలుగులోనూ కరోనా టీకా రిజిస్ట్రేషన్

Cowin Portal

Cowin Portal : కరోనా టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ ఇప్పుడు హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసింది.

దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. దాంతో ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. దాని వల్ల సిబ్బందిపై ఒత్తిడి పడుతుందని గుర్తించిన ప్రభుత్వం.. హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వారిపై ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువమందికి టీకా ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.