ఉగ్రదాడికి నిమిషం ముందు: వైరల్‌గా మారిన జవాన్ చివరి వీడియో

అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 03:34 AM IST
ఉగ్రదాడికి నిమిషం ముందు: వైరల్‌గా మారిన జవాన్ చివరి వీడియో

అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. మరి కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం

అప్పటివరకు అంతా సంతోషంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. పుల్వామా ఘటన అనేకమంది కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.

పుల్వామా ఉగ్రదాడికి కొద్ది క్షణాల ముందు ఓ జవాన్‌ తన భార్యకు పంపించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పంజాబ్‌కు చెందిన జవాన్ సుఖ్‌జిందర్‌ సింగ్‌ తన మొబైల్‌లో వీడియో తీసి భార్యకు పంపించారు. అందులో వాహనంలో ఉన్న జవాన్లను వీడియో తీస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భారత సైనికుల ప్రయాణం సాఫీగా సాగిపోతున్నట్టు చెప్పారు. సుఖ్‌జిందర్‌సింగ్‌ ఈ వీడియో పంపిన కాసేపటికే ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు వీర మరణం చెందారు. భర్త మరణంతో శోకంలో మునిగిపోయిన భార్య ఆ వీడియోను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. భర్తతో మాట్లాడిన ఆఖరి మాటలు గుర్తు చేసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. జవానుకు 7 నెలల కుమారుడు ఉన్నాడు.

19 ఏళ్ల వయసులోనే (2003లో) సీఆర్పీఎఫ్‌లో చేరిన సుఖ్‌జిందర్‌ సింగ్‌.. 76వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవారు. 8 నెలల క్రితమే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది.