Cyclone Nivar : చెన్నైలో భారీ వర్షాలు, రైళ్లు, విమానాలు బంద్

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 06:32 AM IST
Cyclone Nivar : చెన్నైలో భారీ వర్షాలు, రైళ్లు, విమానాలు బంద్

Cyclone Nivar : నివార్‌ తుఫాన్‌ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 2.30 మధ్య నివార్‌ తుపాను తీరం దాటినట్టు ఐఎండీ వెల్లడించింది.



రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన విమాన సర్వీసులు 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం నుంచే రద్దయ్యాయి. నవార్‌ తుఫాను కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టును రెండు రోజుల పాటు మూసివేశారు. దీంతో దేశంలోని వివిధ పట్టణాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా చెన్నై వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు నిర్వాహక సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం శంషాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లే నాలుగు సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.



https://10tv.in/cyclone-nivar-live-updates/
తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేశారు. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం హైదరాబాద్‌ – తాంబరం, తాంబరం – హైదరాబాద్‌, మధురై – బికనీర్‌, చెన్నయ్‌ సెంట్రల్‌ – సంత్రగాచి, చెన్నయ్‌ సెంట్రల్‌ తిరుపతి – తిరుపతి నుంచి చెన్నయ్‌ సెంట్రల్‌కు వెళ్లే రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. 29న బికనీర్‌ – మధురై రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.