సగమే కాలిని కరోనా రోగి మృతదేహం..29 గంటలు కళ్లముందే కనిపించిన నరకం

  • Published By: nagamani ,Published On : June 18, 2020 / 08:18 AM IST
సగమే కాలిని కరోనా రోగి మృతదేహం..29 గంటలు కళ్లముందే కనిపించిన నరకం

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో కరోనా సోకి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. కానీ శవం సగం కాలిన తరువాత అంత్యక్రియలు ఆగిపోయాయి. విద్యుత్ సమస్య రావడంతో శవం సగం మాత్రమే కాలింది. దీంతో సదరు మృతుడి బంధువులు అలా రెండూ మూడు గంటలు కాదు ఏకంగా 29 గంటల పాటు విద్యుత్ కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో వారికి కళ్లముందే నరకం కనిపించింది.

ఇందిరాపురానికి చెందిన వ్యక్తి కరోనా సోకి చికిత్స పొందుతూ సోమవారం (జూన్ 15,2020)న ప్రాణాలు కోల్పోయాడు. అతని బంధువులకు డాక్టర్లు సమాచారం అందించి…మృతదేహాన్ని ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత వారంతా విద్యుత్ కిమెటోరియంలో దహనం చేసేందుకు ఘజియాబాద్ లోని  విద్యుత్ శ్మశానవాటికకు తీసుకొచ్చారు. ఉదయం 11గంటలకు మృతదేహాన్ని లోపలికి పంపించి సగం కాలిన తర్వాత మధ్యలోనే కరెంట్ పోయింది. 

దహన సంస్కారాలు ఆగిపోయాయి. అంతా ఆయోమయంలో పడిపోయారు. కరెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చింది. కానీ ఎంతకీ కరెంట్ రాకపోవడంతో ఓ పక్క ఆకలి..మరోపక్క నీరసం వచ్చి నీరసించి పోయారు. అలా ఏకంగా 29 గంటల తర్వాత విద్యుత్ రావడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. దీనిపై అధికారుల తీరుపై ఆ వ్యక్తి బంధవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్థానిక సంప్రదాయం ప్రకారం..మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి అయితే కానీ భోజనం చేయడం కాదు కదా..చుక్క మంచినీరు కూడా తాగరు. దీంతో ఆలస్యం కావడంతో తామంతా నీరసించి పోయామని వాపోయారు సదరు మృతుడి బంధువులు. అలా 29 గంటల తరువాత కరెంట్ రావటంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Read: భారత్‌లో టాప్-10 చైనీస్ యాప్‌లు.. మీ ఫోన్‌లో కనీసం 5యాప్‌లు ఉండొచ్చు