Delhi: రోడ్డుపై సంగీత కళాకారుడిని నిలువరించిన ఢిల్లీ పోలీస్.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట్వీట్ చేశాడు. మరొక యూజర్.. "ప్రజా మార్గంలో కాదు. సరైన అనుమతి తీసుకొని బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఏదైనా చేయండి

Delhi: రోడ్డుపై సంగీత కళాకారుడిని నిలువరించిన ఢిల్లీ పోలీస్.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

Delhi cop stops musician from performing at Connaught Place

Delhi: రోడ్డుపై సంగీత కళా ప్రదర్శన చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసు నిలువరించడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గిటారు వాయిస్తున్న ఒక సంగీతకారుడి చుట్టూ అనేక మంది గుమిగూడారు. కానీ ఢిల్లీకి చెందిన ఒక పోలీసులు బలవంతంగా అతడిని గిటారు వాయించడాన్ని ఆపివేసి, అతడిని అక్కడి నుంచి పంపించడం పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నటుడు రాజేష్ తైలాంగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఈ వీడియో ఇన్‭స్టాగ్రాంలో చూశాను. ఢిల్లీ పోలీసులు ఇలా చేసి ఉండకూడదు. ఇలాంటి కళాకారులు మన ఢిల్లీని మరింత సౌందర్యంగా, సంగీతమయంగా మార్చారు. కానీ ఇలా జరగడం అవమానకరం’’ అని ట్వీట్ చేశారు.

Maharashtra: ఉద్ధవ్‭కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే

15 సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక సంగీతకారుడు గిటార్ వాయించడాన్ని చూడవచ్చు. అకస్మాత్తుగా ఒక పోలీసు వచ్చి అతని గిటార్ కేస్‌ను మూసివేశాడు. గిటార్ మీద నుంచి సంగీతకారుడి చేతిని తీసివేసాడు. “సునై నహీ దే రహా క్యా (నా మాట వినిపించడం లేదా)? ఖడే హో (లేచి నిలబడు)” అంటూ బెదిరించాడు. దీనికి సదరు సంగీత విద్వాంసుడు కూడా చిరాకుపడి “యే కోయి తారీకా హై క్యా (ఇదేనా మీరు వ్యవహరించే విధానం)?” అంటూ వాగ్వాదానికి దిగాడు.

Sonu sood: సోనూ సూద్ చేసిన ఆ పనికి ఆదర్శవంతులు ఇలా ఉండకూడదంటూ మండిపడ్డ రైల్వే శాఖ

రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. “ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి” అని ఒక నెటిజెన్ ట్వీట్ చేశాడు. మరొక యూజర్.. “ప్రజా మార్గంలో కాదు. సరైన అనుమతి తీసుకొని బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఏదైనా చేయండి. ఇలాగే కొనసాగితే, అందరూ వీధుల్లోకి వచ్చి వివిధ కళాకారులు తమ నైపుణ్యాల్ని ప్రదర్శిస్తారు. నైపుణ్యం మంచిదే కానీ, ప్రజా జీవితానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డాడు.