Delhi HC Covid-19 : ఢిల్లీ హైకోర్టు జడ్జీల కోసం 5 స్టార్ అశోక హోటల్లో 100 గదులు బుక్ చేసిన ప్రభుత్వం

ఢిల్లీలోని 5 స్టార్ అశోక హోటల్ కోవిడ్ సెంటర్‌గా మారింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ స్టాఫ్ కోసం ఈ 5 స్టార్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఏకంగా 100 రూంలను రిజర్వ్ చేసింది.

Delhi HC Covid-19 : ఢిల్లీ హైకోర్టు జడ్జీల కోసం 5 స్టార్ అశోక హోటల్లో 100 గదులు బుక్ చేసిన ప్రభుత్వం

Delhi Hc Wants Covid Beds For Itself, Delhi Govt Requisitions 100 Rooms At 5 Star Ashoka

Delhi govt requisitions 100 rooms : ఢిల్లీలోని 5 స్టార్ అశోక హోటల్  కోవిడ్ సెంటర్‌గా మారింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ స్టాఫ్ కోసం ఈ 5 స్టార్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఏకంగా 100 రూంలను రిజర్వ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, కోర్టు అధికారుల కుటుంబాల కోసం హోటల్ ను బుక్ చేసినట్టు చాణక్యపురి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గీతా గ్రోవర్ తెలిపారు. చాణక్యపురిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి, ప్రైమస్ ఆస్పత్రికి ఈ గదులను అటాచ్ చేసినట్టు తెలిపారు. కోవిడ్ కేర్ సర్వీసులను ప్రైమస్ హాస్పిటల్ నిర్వహిస్తుందని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్ లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది సేవలందిస్తారని గీతా గ్రోవర్ పేర్కొన్నారు.

అశోకా హోటల్ స్టాఫ్‌కి తగిన శిక్షణ ఇచ్చారు. పీపీఈ కిట్లు తదితరాలను సమకూరుస్తామని గీతా గ్రోవర్ తెలిపారు. కోర్టు న్యాయమూర్తులు, జుడిషియల్ అధికారుల కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ని కోవిడ్ సెంటర్‌గా మార్చడం ఇదే తొలిసారి. ప్రిమస్ ఆస్పత్రి సౌకర్యం కోసం అంబులెన్స్ సర్వీసును అందిస్తుంది. వ్యర్థాలను పారవేయడం ఆసుపత్రి బాధ్యత తీసుకుంటుంది. హోటల్‌లో సిబ్బంది తక్కువగా ఉంటే.. ఆస్పత్రికి అదనపు సిబ్బందిని కూడా అందించనుంది.

గదులు, హౌస్ కీపింగ్, శానిటైజేషన్, రోగులకు ఆహారం, అన్ని సేవలు హోటల్ ద్వారా అందించనుంది. ఛార్జీలు ఆస్పత్రి ద్వారా వసూలు చేస్తారు. ఆస్పత్రి హోటల్‌కు చెల్లిస్తుంది. ప్రిమస్ ఆస్పత్రి వైద్యులు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని సొంత ఖర్చులతో ఎంపిక చేసుకోవచ్చు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.

నగరంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల కోసం బెడ్స్, ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటోంది. ఢిల్లీ ప్రభుత్వ కోవిడ్ బులెటిన్ ప్రకారం.. ఆదివారం నాటికి, మొత్తం 20,333 బెడ్స్ నుంచి 1,579 బెడ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ ఆరోగ్య కేంద్రాల్లోని 196 పడకలలో 56 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఒక్కరోజే 20 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 380 మంది మృతి చెందారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తగ్గుతోంది.