Delhi liquor scam..ED Raids : హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో మరోసారి ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవ‌క‌త‌వ‌క‌లు కేసులో ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు మరోసారి దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ్ లలో 35 ప్రాంతాల్లో ఈడీ బృందాలు దాడుల్ని నిర్వహిస్తున్నాయి.

Delhi liquor scam..ED Raids : హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో మరోసారి ఈడీ సోదాలు

Delhi liquor scam..ED Raids

Delhi liquor scam..ED Raids : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవ‌క‌త‌వ‌క‌లు కేసులో ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ED) దేశవ్యాప్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు మరోసారి దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ్ లలో 35 ప్రాంతాల్లో ఈడీ బృందాలు దాడుల్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ ఇచ్చిన సమాచారంతో పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 20 విజయ్ నాయర్ కు..అక్టోబర్ 10 వరకు సమీర్ మహేంద్రు లకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై సహా మరో 5 గురుపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాబిన్ డిస్ట్రిలర్స్ పేరుతో రామచంద్రన్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో దాడులు చేయడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మద్యం వ్యాపారులు ఉండే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, జోర్​బాగ్​లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అర‌వ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవ‌ల ఈడీ సోదాలు చేప‌ట్టింది. కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మ‌నీ ల్యాండ‌రింగ్ కేసును బుక్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కదులుతున్న డొంక.. ఈడీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు ..

సీఎం కేజ్రీవాల్​ ప్రభుత్వం 2021 నవంబర్​లో తీసుకొచ్చిన ఎక్సైజ్​ పాలసీ-2022(నూతన మద్యం విధానం) నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల క్రమంలో దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కొద్దిరోజుల కింద సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో జరిగిన నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్‌ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జీఎన్‌సీటీడీ యాక్ట్‌ 1991, ట్రాన్సాక్షన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూల్స్‌, దిల్లీ ఎక్సైజ్‌ యాక్ట్‌-2009తోపాటు దిల్లీ ఎక్సైజ్‌ రూల్స్‌-2010ల నియమాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని గవర్నర్ తెలిపారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్సుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పాత్రను కూడా అందులో ప్రస్తావించారు.ఎల్​జీ సీబీఐ విచారణకు ఆదేశించిన క్రమంలో సెప్టెంబర్ లో నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పాత మధ్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.