Bank Loot : బ్యాంకులో భారీ దోపిడీ.. 3 నెలలు స్కెచ్ వేసి, గోడకు కన్నమేసి, రూ.55లక్షలు చోరీ

దేశ రాజధాని ఢిల్లీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. షాదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.

Bank Loot : బ్యాంకులో భారీ దోపిడీ.. 3 నెలలు స్కెచ్ వేసి, గోడకు కన్నమేసి, రూ.55లక్షలు చోరీ

Bank Loot

Bank Loot : దేశ రాజధాని ఢిల్లీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. షాదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దుండగుడు బ్యాంకులోని రూ.55 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. సోమవారం వచ్చేసరికి బ్యాంకు గోడకు రంధ్రం ఉండటం గమనించిన అధికారులు షాక్ తిన్నారు. చోరీ జరిగిన విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఎంతో చాకచక్యంగా బ్యాంకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం గోడకు కన్నమేసి బ్యాంకులోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.

శుక్రవారం, శనివారం డిపాజిటర్ల నుంచి బ్యాంక్ డబ్బు వసూలు చేసింది. ఆ నగదుని దొంగిలించాడు. కాగా, బ్యాంకు లాక‌ర్ల‌లో ఉన్న న‌గ‌లు, ఆభ‌ర‌ణాలు సురక్షితంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. బ్యాంకును ఆనుకుని ఉన్న ప్రాంతంలో భవన నిర్మాణం జరుగుతోంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు భవనం గోడ గుండా బ్యాంకులోకి రావడానికి రంధ్రం చేశాడు. బ్యాంకులో అమ‌ర్చిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా దొంగ‌ చిక్కాడు. చోరీకి వచ్చిన సమయంలో అతడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి నగదుని రికవరీ చేశారు. దొంగను హరిరామ్(34) గా పోలీసులు గుర్తించారు. అతడితో పాటు అతడికి తెలిసిన వ్యక్తి కాళీచరణ్(39) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ విశ్వాస్ నగర్ వాసులు.

హరిరామ్ బ్యాంకు సమీప ప్రాంతంలోనే నివాసం ఉంటాడు. భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బ్యాంకులో ఆధునికీకరణ పనులు జరిగాయి. ఆ పనులు చేసేందుకు హరిరామ్ వచ్చాడు. అదే సమయంలో హరిరామ్ బ్యాంకులో డబ్బుపై కన్నేశాడు. చోరీ చేయాలని నిర్ణయించుకున్న హరిరామ్ రెక్కీ చేశాడు. క్యాష్ ఉంచే ప్లేస్ చూశాడు. లోనికి ఎలా రావాలి, బయటకు ఎలా వెళ్లాలి అన్నీ తెలుసుకున్నాడు. బ్యాంకులో చోరీకి మూడు నెలలు స్కెచ్ వేశాడు. చివరికి అదను చూసి గోడకు రంధ్రం వేసి బ్యాంకులోకి చొరబడి చోరీ చేశాడు. చోరీ చేసిన డబ్బుని గ్యాంబ్లింగ్ కోసం వాడాలని హరిరామ్ అనుకున్నాడు.