హిందీని బలవంతంగా రుద్దవద్దు. ఆయుష్ కార్యదర్శి ని సస్పెండ్ చేయాలి. పట్టుబట్టిన కనిమొళి

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 07:41 AM IST
హిందీని బలవంతంగా రుద్దవద్దు. ఆయుష్ కార్యదర్శి ని సస్పెండ్ చేయాలి. పట్టుబట్టిన కనిమొళి

ఇంకెంతకాలం వివక్ష ? హిందీని బలవంతంగా రుద్దవద్దు..ఆయుష్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీఎంకే నేత, MP కనిమొళి డిమాండ్ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు ట్రైనింగ్ క్లాసుల నుంచి బయటకు వెళ్లాలని సూచించిన ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు ఆయుష్ మంత్రి శ్రీ పాద్ నాయక్ కు ఓ లేఖ రాశారు. ఆయన చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు పాల్గొన్నరు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారు.

హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగ టీచర్లు, మెడికల్ ప్రాక్టీస్ నర్లు కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలంటూ ఆయుష్ కార్యదర్శి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో కనిమొళి పై విధంగా స్పందించారు.

హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మానుకోవాలని ట్వీట్ చేశారు. దీనిని పలువురు ఖండించారు. ఆయుష్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండ చూసుకోవాలని పీఎం ఆఫీస్ కు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఖండించారు.

ఇటీవల..హిందీ భాషకు సంబంధించి పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతగా రుద్దే ప్రయత్నం చేస్తోందన మండిపడుతున్నారు. ఎయిర్ పోర్టులో హిందీ మాట్లడడం రాదన్నందుకు కనిమొళిని ఓ సీఐఎస్ఎఫ్ అధికారి..మీరు భారతీయులేనా ? అని ప్రశ్నించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.