Doctor tests positive : షాకింగ్ న్యూస్ : రెండు డోసులు తీసుకున్నా.. వైద్యుడికి కరోనా వైరస్

కోవిషీల్డ్ టీకా రెండు డోస్ లు తీసుకున్నా..62 సంవత్సరాల వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది.

Doctor tests positive : షాకింగ్ న్యూస్ : రెండు డోసులు తీసుకున్నా.. వైద్యుడికి కరోనా వైరస్

Corona Vaccine

vaccination : కరోనా వైరస్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. భారతదేశంలో తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో..రెండో సారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతోంది. రెండు డోస్ లు కంపల్సరీ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..టీకా తీసుకున్న తర్వాత.. కూడా.. వైరస్ సోకుతుండడం కలకలం రేపుతోంది. కోవిషీల్డ్ టీకా రెండు డోస్ లు తీసుకున్నా..62 సంవత్సరాల వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది.

జిల్లా నోడల్ అధికారి, అదనపు చీప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహిర్ పాల్ వివరాలు వెల్లడించారు. ఆ వైద్యుడి భార్యకు కూడా కరోనా సోకిందని తెలిపారు. వైద్యుడు రెండు డోస్ లు టీకా వేయించుకున్నారని..అతని భార్య వేయించుకోలేదన్నారు. ప్రస్తుతం వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థత 60 శాతం, కోవాక్జిన్ సమర్థత 80 శాతం ఎక్కువేనన్నారు. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, కేసును నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.

తాను జనవరి 19వ తేదీన కోవిషీల్డ్ మొదటి మోతాదు తీసుకున్నట్లు, అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన రెండో డోస్ తీసుకోవడం జరిగిందని వైద్యుడు వెల్లడించారు. అయితే..పది రోజుల క్రితం..తన భార్యకు జ్వరం వచ్చిందని, చికిత్స చేసినా..జ్వరం తగ్గలేదన్నారు. అప్పుడు టెస్టు చేయగా..పాజిటివ్ వచ్చిందన్నారు. తనకు లక్షణాలు స్వల్పంగా ఉన్నా..తన భార్య, కొడుకు మాత్రం తీవ్రంగా ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాల క్రితం..నోటి క్యాన్సర్ తో బాధ పడ్డానని, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగిందన్నారు. టీకా తీసుకున్నందు వల్లే..తక్కువ ప్రభావితం చూపించి ఉండవచ్చన్నారు. నెల రోజుల క్రితం..తన భార్య Aambagan ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీ పార్లర్ ను సందర్శించినట్లు..ఈ విషయాన్ని వెల్లడించిన అనంతరం ఆ బ్యూటీ పార్లర్ ను అధికారులు సీజ్ చేశారన్నారు.

తూర్పు Singhbhum జిల్లా హెల్త్ డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకు 8 వేల మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు ఇచ్చిందని, టీకాలు వేసిన వ్యక్తికి పాజిటివ్ రావడం మొదటి కేసుగా తెలిపారు. రెండో మోతాదు తీసుకున్న అనంతరం..రోగ నిరోధక శక్తి రావడానికి కొన్ని రోజులు టైం పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.