PM MODI : మహిళల హాకీ టీమ్ కి మోదీ ఫోన్..ఏడవద్దు,భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది

టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.

PM MODI : మహిళల హాకీ టీమ్ కి మోదీ ఫోన్..ఏడవద్దు,భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది

Modi2

PM MODI  టోక్యో ఒలింపిక్స్‌లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు ప్రధాని మోదీ. భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్లు,కోచ్ తో తో శుక్రవారం ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. సుమారు 3 నిమిషాల కాల్ సమయంలో ప్రధాని మోడీ.. టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, మహిళల హాకీ క్రీడాకారులు అందరినీ అభినందించారు. టోర్నీలో సమిష్టి కృషితో రాణించారని కితాబిచ్చారు. మీరు చెమటోడ్చిన ఫలితమే దేశంలోని కోట్లాది మంది అమ్మాయిలు హాకీ ఆడటానికి ప్రేరణ అవుతుందంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని నవనీత్ కౌర్ గాయం గురించి ప్రధాని వాకబు చేశారు. దీనికి, కెప్టెన్ రాణి రాంపాల్..నవనీత్ కౌర్ కి కంటి దగ్గర నాలుగు కుట్లు వేసినట్లు సమాధానమిచ్చారు. దీని తర్వాత ప్రధాన మంత్రి..మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వందన కటారియా,షాలిమా టీటెని ప్రశంసించారు.

అయితే ప్రధాని ఫోన్ కాల్ చేయడంతో మహిళా క్రీడాకారిణులు ఒక్కసారి భావోద్వేగానికి లోనయ్యారు. పసిడి పతకం సాధించలేకపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఏడుపు ఆపమని వారిని కోరారు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు.. దేశం మీ గురించి గర్వపడుతుంది..మీ కృషి కారణంగా చాలా దశాబ్దాల తర్వాత దేశానికి గుర్తింపుగా నిలిచిన హాకీ మళ్లీ పుంజుకుంటుందని వారితో మోదీ అన్నారు.

ఈ సందర్భంగా భారత మహిళల హాకీ టీమ్ కోచ్ “స్జోర్డ్ మారిజనే”తో మోదీ మాట్లాడుతూ..మీరు మీ స్థాయిని ఉత్తమంగా ప్రయత్నించారు. మీరు అమ్మాయిలను ప్రోత్సహించారు. భవిష్యత్తు కోసం మీకు శుభాకాంక్షలు అని మోదీ కోచ్ తో అన్నారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన కోచ్ మారిజనే.. ఓడిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా భావోద్వేగానికి గురయ్యారని మోదీకి తెలిపారు. మీరు దేశానికి స్ఫూర్తినిస్తారు మరియు అది చాలా ముఖ్యం అని తాను అమ్మాయిలకు చెప్పానని ఫోన్ కాల్ ముగింపు సమయంలో మోదీకి కోచ్ తెలిపారు. కాగా,గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో భారత మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఈ పరాజయాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో కాంస్య పతకం దక్కకుండా పోయింది.

మరోవైపు,ఉద్రిక్తమైన మ్యాచ్‌లో 41 సంవత్సరాల తర్వాత తొలి ఒలింపిక్ పతకాన్ని గెలిచిన భారత పురుషుల హాకీ బృందాన్ని కూడా గురువారం ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రశంసించిన విషయం తెలిసిందే.