జమ్మూకాశ్మీర్‌లో భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 01:17 AM IST
జమ్మూకాశ్మీర్‌లో భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా జమ్మూకాశ్మీర్ ప్రజలు ఆందోళన చెందారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

 

పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. నిరసనలు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జవాన్లపై ఉగ్రదాడిని నిరసిస్తూ చేపట్టిన ర్యాలీ హింసకు దారితీసింది. కొందరు వేర్పాటువాదులు, ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై రాళ్లు రువ్వారు. పెద్ద ఎత్తున వాహనాలను ధ్వంసం చేశారు.