MP Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్ ఇచ్చింది...పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ..

MP Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

Ed Attaches Mp Sanjay Rauts Property

ED attaches MP sanjay rauts property : శివ‌సేన ఎంపీ..సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ED) అధికారులు షాకిచ్చారు. సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.1034 కోట్ల విలువైన భూముల స్కామ్ లో సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసింది. అయితే దాదాపు ఈ 11 కోట్ల‌లో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన‌వి కాగా… 2 కోట్లు సంజ‌య్ రౌత్ భార్య‌కు సంబంధించిన‌వే ఉన్నాయి. రూ.1000 కోట్ల పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రౌత్‌కు సంబంధించిన అలీబాగ్ ప్లాట్‌, ముంబైలోని ఒక్కొక్క ఫ్లాట్‌ను అటాచ్ చేసింది.

ఈడీ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి కొన్ని గంట‌ల ముందే శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడికి లేఖ రాశారు. రూ.1000 కోట్ల ప‌ట్రాచాల్ భూ అవినీతికి సంబంధించిన విష‌యంలో ఈడీ త‌న అధికారాల‌ను దుర్వినియోగం చేస్తోందంటూ రౌత్ ఉప రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లారు. ఈడీతో స‌హా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్‌గా చేస్తున్నాయంటూ రౌత్ ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడికి ఫిర్యాదు చేశారు.

అలాగే ఈ కేసుతోపాటు మరో భూకుంభకోణం ఆరోపణల్లో ఈడీ కొద్ది రోజుల కిందట సీఎం ఉద్ధవ్ ఠాక్రే బావమరిది శ్రీధర్‌ మాధవ్‌ ఆస్తులనూ జప్తు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో శివసే, ఎన్సీపీకి చెందిన పలువురిని ఈడీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది.కాగా..ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్‌కు కూడా ఈడీ షాకిచ్చింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆయ‌న ప‌రివారానికి సంబంధించి 4.81 కోట్ల‌ను అటాచ్ చేసింది.

శివసేన, ఎన్సీపీ నేతల్ని ఒక్కరుగా టార్గెట్ చేస్తూ వస్తోన్న కేంద్ర సంస్థలు.. ఇప్పుడు ఏకంగా శిసేనకు కుడిభుజం లాంటి సంజయ్ రౌత్ పై తీవ్ర చర్యలకు దిగాయి. రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేయటం గమనించాల్సిన విషయం.