Bengaluru : సూసైడ్ నోట్.. ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశం ఇవ్వండి

తాము మరణించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఓ కుటుంబం లేఖ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Bengaluru :  సూసైడ్ నోట్.. ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశం ఇవ్వండి

Bengaluru

Bengaluru : ఆత్మహత్యచేసుకోవాలనుకున్న కుటుంబం లేఖ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది.. ఈ సంఘటన బెంగళూరు బాగలగుంటలో చోటుచేసుకుంది. గాంధీ, శాలిని దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుర్లు, కుమారుడు చిరంజీవి తుమకూరులో చదువుతున్నాడు. కూతుర్లు భానుశ్రీ, హేమాశ్రీలు తల్లిదండ్రుల వద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. అయితే ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో ఏమో..ఈ లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయారు.

అయితే తుమకూరులో ఉన్న కుమారుడు చిరంజీవి తల్లిదండ్రులకు ఆగస్టు 12న ఫోన్ చేశాడు. ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో కంగారుపడి దగ్గర్లోని తన స్నేహితుడికి ఫోన్ చేసి తమ ఇంట్లో వారికి ఫోన్ ఇవ్వాలని కోరాడు. దీంతో స్నేహితుడు వారి ఇంటికి వెళ్లి పరిశీలించగా ఇంటికి తాళం వేసి ఉంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్నేహితుడు ఇంటి ఓనర్ ను ఆరా తీశారు. వాళ్ళు సామాను మొత్తం సర్దుకొని వెళ్లిపోయారని సమాధానం ఇచ్చాడు ఓనర్.

ఇదే విషయాన్నీ చిరంజీవికి చెప్పాడు అతడి స్నేహితుడు. దీంతో తుముకూరు నుంచి వచ్చి తన దగ్గర ఉన్న తాళంతో డోర్ తెరిచాడు చిరంజీవి. కిటికీలో ఓ కాగితం కనిపించడంతో దానిని పరిశీలించాడు. తమకు బతకటం చాలా కష్టమవుతోంది, ఈ జీవితం అవసరం లేదు. దయచేసి మరణించేందుకు అవకాశం ఇవ్వాలని అందులో రాసి ఉంది. చిరంజీవి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు జరుపుతున్నారు.