Ananta Padmanabhaswamy Procession : అనంత పద్మనాభస్వామి ఊరేగింపు.. విమానాలు ఎగరడం ఐదు గంటలపాటు బంద్

ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దైవంగా ప్రసిద్దిచెందిన అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభస్వామి వ్యాహ్యాళికి బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాలు ఐదు గంటలపాటు ఎగరడం మానేసి నేలపైనే ఉండిపోతాయి.

Ananta Padmanabhaswamy Procession : అనంత పద్మనాభస్వామి ఊరేగింపు.. విమానాలు ఎగరడం ఐదు గంటలపాటు బంద్

Ananta Padmanabhaswamy

Ananta Padmanabhaswamy Procession : ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దైవంగా ప్రసిద్దిచెందిన అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభస్వామి వ్యాహ్యాళికి బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాలు ఐదు గంటలపాటు ఎగరడం మానేసి నేలపైనే ఉండిపోతాయి. ఈ అపూర్వ ఘట్టం ప్రతి ఏడాది రెండు సార్లు ఆవిష్కృతమవుతుంది.

అయితే తాజాగా ఆ అపూర్వ ఘట్టం మంగళవారం సాక్షాత్కరించింది. అనంతపద్మనాభస్వామిని ఆరటు పేరిట సంప్రదాయ బద్దంగా గుడి నుంచి ఎయిర్ పోర్టు రన్ వే పైకి గొప్ప ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడి కొబ్బరికాయ మండపం వద్ద ఉత్సవమూర్తులను కొద్దిసేపు ఉంచారు. కొన్ని పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని తిరిగి కోవెలకు తీసుకెళ్లారు.

అనంత పద్మనాభస్వామి వ్రతం….14 సంఖ్య ప్రాధాన్యత

ఈ సందర్భంగా ఊరేగింపుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎయిర్ పోర్టు రన్ వేను అధికారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేశారు. ఆ సమయంలో టేకాఫ్, ల్యాండింగ్ లను రద్దు చేశారు. ఈ కారణంగా 10 విమానాలను రీషెడ్యూల్ చేశారు. 18వ శతాబ్దం నుంచి ఈ ఉత్సవం జరుగుతుండటం గమనార్హం.