Flipkart CoviSelf : ఫ్లిప్‌కార్ట్‌లో కోవీసెల్ఫ్ కరోనా కిట్ అమ్మకాలు

కరోనా అనే అనుమానంతో ఉన్నా.. టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ పాజిటివ్ పేషెంట్లతో కలిసి నిల్చొంటే లేని వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని టెస్టింగ్ కే వెళ్లకుండా ఉండిపోతున్నారు.

Flipkart CoviSelf : ఫ్లిప్‌కార్ట్‌లో కోవీసెల్ఫ్ కరోనా కిట్ అమ్మకాలు

Flipkart

Flipkart CoviSelf : కరోనా అనే అనుమానంతో ఉన్నా.. టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ పాజిటివ్ పేషెంట్లతో కలిసి నిల్చొంటే లేని వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందో అని టెస్టింగ్ కే వెళ్లకుండా ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసమే ఇళ్లలోనే టెస్టు చేసుకోవడం కోసం కొవీసెల్ఫ్ రెడీ అయింది. రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి.

దీని అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లోనూ మొదలైపోయాయి. అంతేకాదు.. 2 నుంచి 18 సంవత్సరాలకు వారికి కూడా పరీక్ష చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజెన్ కిట్ లో.. సేఫ్ స్వాబ్, టెస్ట్ కార్డ్, ప్రీఫిల్ ఎక్స్‌ట్రాక్షన్ ట్యూబ్, డిస్పోజబుల్ బ్యాగ్, యూజర్ మ్యానువల్ ఉంటాయి. పైగా ఈ ప్యాక్ వ్యాలిడిటీ 24నెలలు.

స్వాబ్ శాంపుల్ తో జరిపే ఈ టెస్టులో ప్రోసెస్ ఇలా ఉంటుంది. ట్యూబ్ తో శాంపుల్ తీసుకుని రెండు చుక్కలు కిట్ పై వేసి 15నిమిషాలు ఉంచాలి. అందులో రిజల్ట్ చూసుకుని కిట్ ను డిస్పోజబుల్ బ్యాగ్ లో వేసి నాశనం చేసేయాలి.

పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమెదం కూడా తెలియజేసింది.

‘టెస్టు చేయడానికి రెండు నిమిషాల సమయం పట్టడంతో పాటు ఫలితం కోసం 15నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. రాబోయే వారం చివరి నాటికి అందుబాటులో ఉంటుందని.. ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో దొరుకుతుంది. మా లక్ష్యం ఇండియాలో 90శాతం ప్రాంతాలకు ఇది చేరుకోవాలని’ అని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరక్టర్ సుజీత్ జైన్ చెప్పారు.