Gujarat’s Morbi: మోదీ వస్తున్నారని రాత్రికి రాత్రి ఆసుపత్రిని బాగు చేసిన వైనం.. ఫొటోలు వైరల్

గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్యల గురించి ఇన్నాళ్లు పట్టించుకోని ఆసుపత్రి అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా మోదీ వస్తున్నారన్న భయంతో కళ్లు తెరిచారు. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Gujarat’s Morbi: మోదీ వస్తున్నారని రాత్రికి రాత్రి ఆసుపత్రిని బాగు చేసిన వైనం.. ఫొటోలు వైరల్

Gujarat's Morbi

Gujarat’s Morbi: గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్యల గురించి ఇన్నాళ్లు పట్టించుకోని ఆసుపత్రి అధికారులు ఇప్పుడు ఒక్కసారిగా మోదీ వస్తున్నారన్న భయంతో కళ్లు తెరిచారు. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతోంది. వారిని మోదీ పరామర్శించే అవకాశం ఉంది. దీంతో, ఆసుపత్రిని సమస్యల వలయంగా ఉంచిన తమ నిర్లక్ష్యం బయటపడకుండా అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

గత రాత్రి మొత్తం ఆసుపత్రికి రంగులు వేయించడం, పాడైపోయిన పరికరాలను బాగు చేయించడం వంటి పనుల్లోనే అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రికి రాత్రి కొత్త వాటర్ కూలర్లను తెప్పించి పెట్టారు. పాడైపోయిన గోడలను బాగుచేయించారు. ఆసుపత్రిలోని ఓ వార్డులో బెడ్ షీట్లను మార్చారు. కాగా, బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 140 మంది మరణించిన సంగతి తెలిసిందే.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..