కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2020 / 12:41 PM IST
కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలో చాలామంది ఉద్యోగాలు,జీవనాలపై ఈ వైరస్ ప్రభవం పడింది. ఈ సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

దేశారాజధానిలో 72లక్షలమంది ప్రజలకు ఉచిత రేషన్,పెన్షన్ లను రెట్టింపు చేస్తున్నట్లు ఆదివారం(మార్చి-22,2020)సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగస్తులందరికీ కంపెనీలు పెయిడ్ లీవ్ లు ఇవ్వాలని తాను అర్థిస్థున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇళ్లల్లో పనిచేసే పనిమనుషులకు కూడా పెయిడ్ లీవ్ లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇది కేవలం జాలి సంజ్ణ కాదని,ఇది మన ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి సామర్థ్యమైనదని కూడా కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా తెలిపారు.

అంతేకాకుండా ఢిల్లీవ్యాప్తంగా నైట్ షెల్టర్ల కోసం కొన్ని ప్రత్యేక గృహాలను ఎంపిక చేసి,అందులోకి వారికి భోజనం అందిస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లేస్ లలోకి వచ్చి భోజనం చేయవచ్చని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆకలితో ఏ ఒక్కరూ బాధపడకూడదని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన ప్రకారం…ఢిల్లీలో ఇప్పటివరకు 27కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక కరోనా మరణం సంభవించగా,ఐదుగురు ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

See Also |  తెలంగాణలోని 5 జిల్లాల్లో మార్చి 31వరకు లాక్‌డౌన్: కేంద్రం