Republic Day Celebrations Rehearsals : ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్.. ఏపీ శకటం సందడి, తెలంగాణకు దక్కని చోటు

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది.

Republic Day Celebrations Rehearsals : ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్.. ఏపీ శకటం సందడి, తెలంగాణకు దక్కని చోటు

Republic Day rehearsals

Republic Day Celebrations Rehearsals : ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది. కోనసీమ ప్రభల తీర్థం గణతంత్ర దినోవత్స వేడుకలకు ఎంపికైంది. జనవరి 26న జరిగే పరేడ్ కు సన్నద్ధతగా ఈ రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.  ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుపుతారు.

విజయచౌక్ నుంచి ఎర్రకోట వరకు ఇది సాగనుంది. త్రివిద దళాల సైనిక కవాతులు, కేంద్ర, రాష్ట్ర శకటాలు ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు, జరుగనున్నాయి. 17 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన జరుగనుంది. సీఆర్ పీఎఫ్ కు చెందిన నారీశక్తి శకటం నార్కోటిక్ శకటానికి ఈ వేడుకల్లో చోటు దక్కింది. దక్షిణ భారత దేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు అవకాశం దక్కగా తెలంగాణ శకటమేది ఎంపిక కాలేదు.

Seed Paper : ఈ రిపబ్లిక్ ఇన్విటేషన్ కార్డును నాటితే.. ఉసిరి మొక్క మొలుస్తుంది తెలుసా?

450 ఏళ్తుగా కొనసాగుతున్న ప్రభల తీర్థం సంస్కృతితో ఏపీ శకటాన్ని తీర్చి దిద్దారు. ప్రభల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంపై కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం గంగకులకూరు అగ్రహారం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.  500 ఏళ్ల క్రితం నుంచి ఈ సంస్కృతి ఉందని… 400 ఏళ్లుగా ఒక పద్ధతిలో కొనసాగుతూవస్తోందని చెప్పారు. కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో కనుమ నాడు ప్రభల తీర్థం వేడుక జరుగుంది.

ఏకాదశ రుద్రుల ఒక చోట చేరడమే ప్రభల తీర్థం పరమార్థం. మరోవైపు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రత పెంచారు. ఢిల్లీ, జమ్మూలో భారీగా పోలీసులు మోహరించారు. సరిహద్దుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని హోటళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.