ఇక నుంచి బెంగళూరులో ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 04:23 PM IST
ఇక నుంచి బెంగళూరులో ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్

ఇక నుంచి బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం యడ్యూరప్ప కరోనావైరస్ పరిస్థితిపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసరి సర్వీసులు మాత్రమే నిర్వహించాలని సూచించారు.

సోమవారం నుంచి రాత్రి సమయాల్లో 8దాటితే కర్ఫ్యూ విధించి ఉదయం 5గంటల వరకూ కొనసాగించనున్నట్లు వెల్లడించారు. సివిక్ ఏజెన్సీ బీబీఎంపీ హోల్ సేల్ వెజిటెబుల్ మార్కెట్స్ లలో క్రౌడ్ నుంచి తప్పించుకుంటే, గ్రోసరీ స్టోర్లలో దూరంగా ఉండగలిగితే కరోనా నుంచి బయటపడొచ్చు. కొవిడ్ 19పేషెంట్ల కోసం బెడ్ ల ఏర్పాటు వేగవంతం చేయాలని… ఆఫీసర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

 

అంబులెన్స్ లలో పేషెంట్లను తీసుకెళ్లే సంఖ్య 250కు పెంచారు. కొవిడ్ 19తో బాధపడుతూ మృతిచెందిన వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లోని జాయింట్ కమిషనర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బెంగళూరులోని కళ్యాణ మండపాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలు కొవిడ్ 19 కేర్ సెంటర్లుగా మర్చాలంటూ సీఎం అధికారులను అడిగారు.

 

రైల్వే కోచ్ లు బెడ్స్ తో పాటు అదనపు సౌకర్యాల కోసం వినియోగించాలని సూచించారు. కేంద్రం 15టీమ్స్ ను కేటాయించిందని.. పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు ఎపిడెమియాలజిస్టులు, ఇతర స్పెషలిస్టులు కరోనా ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు పోరాడనున్నారు.