3 Fungus in One Man: ఒకే వ్యక్తిలో మూడు రకాల ఫంగస్ లు..చికిత్స చేసినా ఫలించని డాక్టర్ల యత్నం

3 Fungus in One Man: ఒకే వ్యక్తిలో మూడు రకాల ఫంగస్ లు..చికిత్స చేసినా ఫలించని డాక్టర్ల యత్నం

3 Fungus In One Man

Single person Black, White,Yellow Fungus : కరోనా నుంచి కోలుకున్నాం..ప్రాణాలతో బైటపడ్డాం..హమ్మయ్య అనే ఆనందం పట్టుమని పది రోజులు కూడా గడకకుండానే పలు రకాల ఫంగస్ లో దాడి చేస్తున్నాయి బాదితుల మీద. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. ఏదో ఒక ఫంగస్ బారిని పడితే..త్వరగా గుర్తిస్తే బతికి బట్టకట్టే అవకాశముంది. కానీ మూడు రకాల ఫంగస్ లు ఒకే వ్యక్తిపై దాడి చేస్తే…ఇక అతని పరిస్తితి ఏంటీ. అదే జరిగింది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వ్యక్తికి.

బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు ఒకే వ్యక్తిపై దాడి చేశాయి. ఒకే వ్యక్తిలో మూడు రకాల ఫంగస్ లను గుర్తించిన డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. సదరు బాధితుడు పాపం ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

ఘజియాబాద్ కు చెందిన కున్వర్ సింగ్ అనే అడ్వకేట్ కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేరాడు. అతని ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు వెంటనే ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీలో దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. కున్వర్ లాల్ శరీరంలో మూడు ఫంగస్ లను గుర్తించారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లను గుర్తించిన డాక్టర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స చేశారు.అయినా ఫలితం దక్కలేదు.

అడ్వకేట్ కున్వర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. కరోనా నుంచి కోలుకున్నా..కాస్త రిలీఫ్ అయినా లేకముందే..మూడు రకాల ఫంగస్ లు దాడి చేయటంతో కున్వర్ సింగ్ రక్తం విషపూరితంగా మారిపోవటంతో డాక్టర్లు చేసిన చికిత్స ఫలించలేదు. మూడు రకాల ఫంగస్ లతో గత రాత్రి మరణించాడు.