నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ : పులి నుంచి తమ్ముడిని కాపాడిన 11ఏళ్ల బాలిక

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2019 / 03:32 PM IST
నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ : పులి నుంచి తమ్ముడిని కాపాడిన 11ఏళ్ల బాలిక

పులి నోట కరుచుకుని వెళ్దామనుకున్న తన నాలుగేళ్ల తమ్ముడిని అత్యంతధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడింది 11ఏళ్ల చిన్నారి. అయితే పులితో పారాటంలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఉత్తరఖాండ్ లోని పౌరీ జిల్లాలోని దేవ్ కండై తల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేవ్ కండై తల్లి గ్రామంలో అక్టోబర్-4,2019న రాఖీ అనే 11ఏళ్ల బాలిక తన నాలుగేళ్ల తమ్ముడితో కలిసి ఆడుకుంటోంది. ఈ సమయంలో ఓ చిరుత పులి తన తమ్ముడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో రాఖీ ధైర్యసాహసాలు ప్రదర్శించి పులి బారిన పడకుండా తన తమ్ముడిని తప్పించాలన్న ఉద్దేశ్యంతో అన తమ్ముడిపై పడుకుంది. పులి నుంచి తన తమ్ముడిని కాపాడే క్రమంలో రాఖీకి మెడపై పులి తీవ్ర గాయాలు చేసింది. భయపెట్టేందుకు పులి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాఖీ భయపడలేదని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే గ్రామస్థులు స్పాట్ కి చేరుకుని అలారమ్ మోగించడంతో పులి అడవిలోకి పారిపోయినట్లు తెలిపారు. 

పులి దాడిలో గాయపడిన చిన్నారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించామని, అయితే తీవ్ర గాయాలు కావడంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారని,వెంటనే చిన్నారని ఢిల్లీలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో తీసుకెళితే అక్కడ ఎంతబతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోలేదని,చివరికి తాము ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే సత్ పాల్ మహారాజ్ ని కలిశామని..వారి జోక్యంతో తమ చిన్నారని అక్టోబర్-7,2019న రామ్ మనోహర్ లో హాస్పిటల్ లో చేర్చించినట్లు చిన్నారి ఆంటీ మధు దేవి తెలిపారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.

ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి చిన్నారి కుటుంబానికి రూ.లక్ష సాయం చేశారని,ఇతర వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చాడని మంత్రి ఓఎస్డీ అభిషేక్ శర్మ తెలిపారు.
ఉత్తరాఖండ్ సీఎం కూడా రాఖీ కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. చిన్నారి రాఖీ  ధైర్యసాహసాలకు  గర్వపడుతున్నానని అన్నారు. ధైర్య పురస్కారానికి బాలిక పేరు సిఫారసు చేయబడుతుందని పౌరి జిల్లా మేజిస్ట్రేట్ డిఎస్ గార్బ్యాల్ తెలిపారు.