Marriage : పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిన యువతి.. గిఫ్ట్ పంపిన యువకుడి అరెస్ట్

తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువతికి సెక్స్ టాయ్స్ పంపాడు యువకుడు.

Marriage : పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిన యువతి.. గిఫ్ట్ పంపిన యువకుడి అరెస్ట్

Marriage

Marriage : తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువతికి సెక్స్ టాయ్స్ పంపాడు యువకుడు. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన కునాల్ అంగోల్కర్ (27) తన పొరుగింట్లోని 21 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రతిపాదించాడు. అయితే అతడికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో కక్షపెంచుకున్న యువకుడు ఈ కామర్స్ వెబ్ సైట్ లా ద్వారా యువతికి ఇంటికి సెక్స్ బొమ్మలు పంపించాడు.

క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు పద్దతిలో యువతి ఇంటి అడ్రెస్స్ పెట్టి బుక్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు ఈ బొమ్మలు పంపాడు. అంతటితో ఆగకుండా యువతి ఫోన్ నంబర్ ను పోర్న్ సైట్స్ లో అప్లోడ్ చేశాడు. ఆమెకు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు రావడం, తరచూ పార్సిల్స్ వస్తుండటంతో మలాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ క్రైంకు బదిలీ చేశారు.

కునాల్ ని పట్టుకునేందుకు శ్రమించిన పోలీసులు

నిందితుడు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఐపీ అడ్రస్ మార్చదు. అతడిని గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. యువతికి బొమ్మలను ఆర్డర్ చేసి పంపిన కునాల్ ప్రతీసారి ఐపీ అడ్రస్ మార్చేవాడు. దీంతో పోలీసులు 500 మంది సర్వీస్ ప్రొవైడర్లను స్కాన్ చేయడంతో అసలు నిందితుడు కునాల్ దొరికాడు. సాంకేతిక పరిశోధన గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సైబర్ సెల్ నిందితుడు కునాల్ అంగోల్కర్‌ను గుర్తించి అరెస్టు చేశారు.