‘క్రిస్మస్ చెట్టు’ : దయగల మనస్సులకు దేవుడు ఇచ్చిన కానుక

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 10:17 AM IST
‘క్రిస్మస్ చెట్టు’ : దయగల మనస్సులకు దేవుడు ఇచ్చిన కానుక

క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు సామాన్య మానవుడిగా భూమిమీద పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైనది. క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే క్రిస్మస్ చెట్టు. అసలు క్రిస్మస్ కు చెట్టుకు ఏంటి సంబంధం అంటే ఈ క్రిస్మస్ చెట్టు వెనుక పలు కథలు వినిపిస్తుంటాయి. 
దాంట్లో ఒక కథ..ఓ పేద వాడు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వ్యక్తి చిన్నపాకలో జీవిస్తుండేవాడు. పాపం వారికి రోజుల తరబడి తినటానికి తిండే ఉండేది కాదు. పస్తులతోనే కాలం వెళ్లదీసేవారు. కానీ పిల్లలు ఆకలితో పడుకోవటంతో ఆ తండ్రి మనస్సు తల్లడిల్లిపోయేది. ఎలాగైనా వారి కడుపు నింపాలని ఆరాటపడేవాడు. అలా ఓ రోజు వారి కోసం తినటానికి ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆ తండ్రి నానా కష్టాలు పడి  ఓ చిన్న రొట్టె ముక్కను సంపాదిస్తాడు. 

దాన్నే మూడు ముక్కలు చేసుకుని తిందామనుకుంటారు. తినేముందు దేవుడ్ని ప్రార్థించుకుంటారు. ‘ఓ జీసస్‌! మాకు ఈ రోజు తినటానికి ఆహారాన్ని ఇచ్చావు. ఇలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వారందరందరి కడుపు నింపు’’ అంటూ ప్రార్థన చేసుకున్నారు. 

ప్రార్థన పూర్తయ్యాక వార రొట్టెముక్క తినబోతుండగా.. ఓ పిల్లాడు చలికి వణికిపోతూ వారి ఇంటికి వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా? అని అడిగాడు. వారు ఆ పిల్లాడిని లోపలికి రమ్మన్నారు. ఆకలిగా ఉంది ఆహారం తిని కొన్ని రోజులైంది ఆకలేస్తోంది తినటానికి కాస్త ఏమన్నా పెడతారా? అంటూ అడిగాడు. 

పిల్లాడు కడుపుడు ఆకలితో ఉన్నాడు తామే తింటే ఎలా అనుకున్నారు వారు. దీంతో వారి మూడు రొట్టె ముక్కలు ఆ పిల్లాడికి ఇచ్చారు. ఓ చిన్నపిల్లాడి కడుపు నింపామనే తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అలా నిద్రపోయిన పిల్లలకు అర్దరాత్రి సమయంలో మెలకువ వచ్చింది. లేచి కూర్చున్నారు. వారికి ఏదో వెలుగు కనిపించింది. ఏంటాని ఆశ్చర్యపోయారు. పైకి చూశారు. అక్కడ మిలమిలలాడే నక్షత్రాల మధ్యలో దేవదూతలు ఎగురుతుంటారు. తమ ఇంటికి వచ్చిన ఆ పిల్లాడు.. తల మీద బంగారు కిరీటంతో మెరిసిపోతూ కనిపించాడు. మీరు చాలా గొప్పవారు. మీరు ఆకలితో ఉన్నా సరే ఎదుటివారి ఆకలి తీర్చారు. మీది చాలా మంచి మనస్సు. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు అని దీవించాడు. అలా ఆ బాలుడు ఇక వెళ్తూ వెళ్తూ వాళ్లింటి బయట ఎండిన కొమ్మ నాటుతాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదవుతుంది. దాని నిండా బంగారు కాయలు కాసింది.  అదే మొట్టమొదటి క్రిస్మస్ చెట్టు అని అంటారు.