Gold Price : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్.. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండటంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి.

Gold Price : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు

Gold Prices Today

Gold Price : బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్.. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండటంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.900లకు పైనే పెరిగింది. ఇక వెండి ధర కూడా పరుగులు పెడుతుంది.. వెండిపై శుక్రవారం ఒక్కరోజే రూ.600 పెరిగింది. తాజా పెరుగుదలతో బంగారం ధర తొమ్మిది నెలల గరిష్ఠానికి చేరింది. ఇక శనివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

చదవండి : Gold Price  : పసిడి ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో రూ.50 వేలు దాటిన బంగారం ధర

ఇక వివిధ నగరాల్లో నమోదైన బంగారం ధరల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,270 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.

చదవండి : Today Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,070 గా ఉంది.

ఇక వెండి ధర రూ.600 పెరిగి రూ.71,400 చేరింది. వెండి ఆభరణాల రేట్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.