డిజిటల్‌ విజిటింగ్‌ కార్డు, గూగుల్‌ సరికొత్త ఫీచర్.. ఫస్ట్ భారతీయులకే

  • Published By: naveen ,Published On : August 12, 2020 / 09:06 AM IST
డిజిటల్‌ విజిటింగ్‌ కార్డు, గూగుల్‌ సరికొత్త ఫీచర్.. ఫస్ట్ భారతీయులకే

ఆన్‌లైన్‌ ద్వారా సమాజంలోని ప్రముఖ వ్యక్తుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. మరి సామాన్యుల సంగతేంటి? వారి వ్యక్తిగత, వ్యాపార వివరా లు గుర్తించడం ఎలా? దీనికోసం ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పీపుల్‌ కార్డ్స్‌’ పేరుతో తెచ్చిన ఈ వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు సేవలను మంగళవారం(ఆగస్టు 11,2020) ప్రారంభించింది.

వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు లాభాలు:
* ఇవి తొలుత భారతీయులకే అందుబాటులోకి రావడం విశేషం.
* ఇంటర్నెట్‌, సోషల్ మీడియాల్లో వినియోగదారులు తమ ఉనికిని తెలియజెప్పేందుకు వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు వీలు కల్పిస్తుంది.
* వినియోగదారులు తమ వెబ్‌సైట్లకు, సోషల్‌ మీడియా ప్రొఫైళ్లకు, సమాచారానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించుకునేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.

ఈ సౌకర్యాన్ని వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, ఫ్రీలాన్సర్లతోపాటు అన్ని రంగాల వ్యక్తులు ఉపయోగించుకోవచ్చని గూగుల్‌ సెర్చ్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ లారెన్‌ క్లార్క్‌ స్పష్టం చేశారు. ‘స్మార్ట్‌ ఫోన్లలో సెర్చ్‌ చేయడం ద్వారా ఈ వర్చువల్‌ విజిటింగ్‌ కార్డును పొందవచ్చన్నారు. ఈ కార్డుపై క్లిక్‌ చేసి పేరు, వృత్తి, ప్రదేశం లాంటి వివరాలను తెలుసుకోవచ్చని, అసభ్యకరమైన, నేరపూరిత సమాచారాన్ని వెల్లడించకపోవడంతోపాటు ఒక గూగుల్‌ ఖాతాకు ఒకే కార్డును పరిమితం చేసేలా అనేక రక్షణాత్మక చర్యలను దీనిలో పొందుపర్చామని ఆయన వివరించారు.