Amrit Udyan: రాష్ట్రపతి భవన్‭లోని ముఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‭గా మార్చిన కేంద్రం

జనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్‭ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి ఉంచుతారు. సాధారణంగా, గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు తెరుస్తారు. కానీ ఈసారి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మరో నెల పెంచారు. ఆ సమయానికి గార్డెన్‭లోని పూలు వికసించే ఉంటాయట.

Amrit Udyan: రాష్ట్రపతి భవన్‭లోని ముఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్‭గా మార్చిన కేంద్రం

Govt renames Delhi's Mughal Gardens to 'Amrit Udyan'

Amrit Udyan: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. అమృత్ ఉద్యాన్‌గా దీనికి శనివారం చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ థీమ్‌కు అనుగుణంగా మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా మాట్లాడుతూ ‘‘75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్‌కు అమృత్ ఉద్యాన్ అని పేరు పెట్టారు’’ అని పేర్కొన్నారు.

YS Viveka Murder Case : అవినాశ్‌రెడ్డి లాయర్ ను కార్యాలయం బయటే ఆపివేసిన సీబీఐ అధికారులు..

జనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్‭ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి ఉంచుతారు. సాధారణంగా, గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు తెరుస్తారు. కానీ ఈసారి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మరో నెల పెంచారు. ఆ సమయానికి గార్డెన్‭లోని పూలు వికసించే ఉంటాయట. అందుకే మరో నెల పొడగించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి భద్రతా లోపంపై అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే