Gujarat Assembly elections : ఆ సంస్థలతో ఈసీ ఒప్పందం .. ఓటు వేయని ఉద్యోగుల పేర్లు నోటీసు బోర్డులో పెడతామంటున్న కంపెనీలు.. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు

గుజరాత్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రభుత్వ, కార్పరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులంతా ఓటు వేసి తీరాలని ఓటు వేసేలా చూసేలా ఈసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా ఉద్యోగులు..సిబ్బంది ఓటు వేయకపోతే..వారి పేర్లు నోటీసు బోర్డులో పెట్టేలా ఆంక్షలు విధించటానికి ఈసీ వత్తాసు పలికింది. దీంతో ఇదంతా బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు వస్తున్నాయి.

Gujarat Assembly elections : ఆ సంస్థలతో ఈసీ ఒప్పందం .. ఓటు వేయని ఉద్యోగుల పేర్లు నోటీసు బోర్డులో పెడతామంటున్న కంపెనీలు.. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు

Gujarat Assembly elections

Gujarat Assembly elections : గుజరాత్‌ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి గెలుపు సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పక్కా ప్లాన్ తో పావులు కదుపుతోంది. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుని..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్పొరేట్ కంపెనీలకు ఓటు వేసే విషయం ఆంక్షలు విధిస్తోంది.

రాష్ట్రంలోని 500 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న 1,017 కార్పొరేట్‌ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పోలింగ్‌ రోజున ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు వేసి తీరాలని ఆంక్షలు విధించింది. ఓటు వేయని ఉద్యోగుల పేర్లు నోటీసు బోర్డుల్లోను..వెబ్ సైటుల్లోను పెడతామంటూ పితలాటం పెట్టింది. ఆయా

సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారా? లేదా? అని పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్టు గుజరాత్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ పీ భారతి తెలిపారు. పోలింగ్‌ రోజున ఓటు హక్కు వినియోగించుకోని ఉద్యోగుల వివరాలను సదరు సంస్థల వెబ్‌సైట్‌, ఆఫీసు నోటీసు బోర్డులో పెడతామని సదరు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అంటే వారి వారి సంస్థల్లో ఉద్యోగులు తప్పకుండా ఓటు వేసి తీరాల్సిందేనని లేకుంటే పేర్లు నోటీసు బోర్డులకు ఎక్కుతాయని తరువాత పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారతాయనే థమ్కీలు సదరు కంపెనీలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదంతా బీజేపీకి మరోసారి పట్టటం కట్టించటానికేనంటు విమర్శలు వస్తున్నాయి.

ఓటు వేయాలంటూ ఉద్యోగులపై గుజరాత్‌ కంపెనీలు ఒత్తిడి తీసుకురావడం..దీనికి ఈసీ కూడా మద్దతు పలకడం..పలు సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి మేలుచేయడానికే కంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కానీ ప్రతిపక్ష నేతల విమర్శలను న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బహేల్ కొట్టిపారేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయడం ప్రజాస్వామ్య దేశంలో సరైన చర్య అనిపించుకోదని..ప్రజాప్రాతినిధ్యచట్టం, 1951 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

కాగా..తప్పనిసరిగా ఓటు వేసి తీరాలనేది భారత్‌లో ఆచరణ సాధ్యంకాదని 2021 ఆగస్టులో కేంద్రప్రభుత్వం స్వయంగా లోక్‌సభలో వెల్లడించింది. కానీ కేంద్రంలోను..అటు గుజరాత్ లోను బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి తనకు అనుకూలంగా పరిస్థితుల్ని మార్చుకోవటానికి అవన్నీ పక్కనపెట్టి కంపెనీలతో కలిసి ఈసీ స్వయంగా ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంపై విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈసీ ఆయా కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవటం వెనుక కమలదళం పక్కా ప్లాన్ కనిపిస్తోంది. ఎందుకంటే గుజరాత్‌లో బీజేపీకి విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో గెలుపు కోసం ఏకంగా ఎన్నికల సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంటోంది బీజేపీ అనే విమర్శలు వస్తున్నాయి.

కాగా ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీకి..బీజేపీ పోటీ తామేనంటోంది ఆప్ పార్టీ. పంజాబ్ విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ ఇప్పుడు గుజరాత్ లో కూడా తనదైన ముద్రవేయాలని ఆప్ చీఫ్..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో తరచు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు.