Rich Dogs : ఆ గ్రామంలో కుక్క పుడితే చాలు…కరోడ్ పతి అయిపోవచ్చు..

Rich Dogs : ఆ గ్రామంలో కుక్క పుడితే చాలు…కరోడ్ పతి అయిపోవచ్చు..

Rich Dogs

Rich Dogs : రూపాయి కోసం మనుషులకు మనుషులకే చంపేసుకుంటున్న రోజులివి. భూములకు మంచి రేటు పలుకుతుందంటే పక్కనోడి స్థలాన్ని కబ్జా చేసేసి మూడో కంటికి తెలీకుండా అమ్మేసుకుంటున్న రోజులివి. అటువంటిది ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న ఓ గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కుక్కల కోసం..వాటిని సంరక్షించటం కోసం భూముల్ని దానం చేస్తున్న ఆ గ్రామం నిజంగా గ్రేట్..సో గ్రేట్ అని అనక తప్పదు. కుక్కలను కోటీశ్వరుల్ని చేస్తున్న ఆ గ్రామం పేరు పంచోట్ గ్రామం. గుజరాత్ రాష్ట్రంలో ఈ పంచోట్ గ్రామంలో కుక్కగా పుడితే చాలు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఆ గ్రామం పుట్టే కుక్క పుట్టుకతోనే లక్షాధికారిలా పుడుతుంది..కుక్కల కోసం ఇంత చేస్తున్న ఈ రియల్ స్టోరీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం..

మనుషులు కోటీశ్వరులుగా ఎదిగిన కథల గురించి వినే ఉంటాం.చూసి కూడా ఉంటాం. కానీ..కుక్క కోటీశ్వరుడు లేదా ఆడ కుక్క అయితే కోటీశ్వరాలు అవ్వడం మీరు ఎప్పుడైనా చూవారా? పోనీ విన్నారా?..ఇదేం రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీయే..

అది గుజరాత్‌లోని మెహ్సానా సమీపంలోని పంచోట్ గ్రామం. గ్రామంలో కుక్కలను పోషించడానికి భూమిని దానం చేసే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో ఈ ఊరికి సమీపంలో మెహ్సానా బైపాస్ నిర్మించబడింది.దీంతో ఈ సమీపంలోని భూమి ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఈ గ్రామంలోని వీధుల్లో తిరిగే కుక్కలకు కూడా మహర్ధశ పట్టుకుంది.

‘మధ్ ని పాటి కుటారియా ట్రస్ట్’ కుక్కల బాగోగులు చూస్తుంది. ఈ ట్రస్టుకు గ్రామంలో సుమారు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఈ భూమి పక్కన బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో లక్ష రూపాయల విలువైన భూమి కోట్ల రూపాయాలకు పెరిగిపోయింది. దీంతో ఈ గ్రామంలోని వీధుల్లో తిరిగే కుక్కలకు కూడా మహర్ధశ పట్టుకుంది. ట్రస్ట్ కింద ఉన్న భూమి విలువ సుమారు రూ. 75 కోట్లకు పెరిగింది. అంటే అదంతా కుక్కల సంరక్షణ కోసమేనన్నమాట. అంటే ఆ డబ్బు..దాని మీద వచ్చే ఆదాయం అంతా ఆ కుక్కలదే అన్నట్లు..

ఈ భూముల ధరలు పెరిగినాగానీ ఆ డబ్బు మీద భూమిని దానం చేసిన యజమానులు తిరిగి ఆశపడలేదు. తమ భూమిని తిరిగి ఇవ్వమని కోరలేదు. దాని మీద వచ్చే డబ్బును జంతువుల కోసం లేదా ఏదైనా సామాజిక పనుల కోసం విరాళంగా వాడుకోమని చెప్పేశారు. విరాళంగా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవడం దుర్మార్గమని ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు.

కుక్కలు భూమి ఆదాయానికి అర్హులు..
ఈ భూములను ఇప్పుడు కొందరు సాగు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పంట విత్తనాల సీజన్‌కు ముందు ట్రస్ట్… భూమిని వేలం పద్దతిలో కౌలుకు ఇస్తుంది. అత్యధిక బిడ్డర్ ఒక సంవత్సరం భూమిని సాగు చేసుకునే హక్కు పొందుతారు. దీనితో పాటు, ఈ భూముల పక్కన ప్రాంతాలలో పెద్ద మాల్స్ నిర్మించడం, బైపాస్ రావడంతో.. ల్యాండ్ ధరలు ఆకాశాన్నంటాయి. కౌలుకు ఇవ్వగా వచ్చిన మొత్తాన్ని కేవలం కుక్కుల కోసమే ఖర్చు చేస్తుంది ట్రస్ట్.

పంచోట్ గ్రామస్తుడైన నరేష్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘మేము దానంగా ఇచ్చిన భూమిని ఎప్పటికీ అమ్ముకోవద్దని ప్రతిజ్ఞ చేశాం. ఇక్కడ జన్మించిన ప్రతి కుక్క లక్షల రూపాయల సంపదతో పుడుతుంది’ అని తెలిపాడు. సెంట్ భూమి కోసం తోబుట్టులు మధ్యే కొట్లాటలే కాదు హత్యలు చేసిన సందర్భాలు కూడా జరుగుతున్న ఈ రోజుల్లో పంచోట్ గ్రామస్తులు అంత విలువైన భూమిని ఇప్పటికీ కుక్కల కోసమే ఉంచేయటం నిజంగా గ్రేట్ కదూ..