ఈసీపై మమత ఫైర్..మోడీ సలహా మేరకే బెంగాల్ లో 8దశల్లో ఎన్నికలని ప్రకటించారా?

ఈసీపై మమత ఫైర్..మోడీ సలహా మేరకే బెంగాల్ లో 8దశల్లో ఎన్నికలని ప్రకటించారా?

mamata benerjee నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు,ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.అయితే, బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ(BJP)కి అనుకూలంగా ఉండేలా ఎన్నికల తేదీలను ప్రకటించారా అంటూ ఎలక్షన్ కమిషన్ ను మమత ప్రశ్నించారు.

ఈసీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని,కానీ జిల్లాలను విడగొట్టడం ఎందుకని మమత అన్నారు. దక్షిణ 24 పరణాస్ జిల్లా తమకు గట్టి ఉన్న ప్రాంతమని,అక్కడ 3దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని..మోడీ,అమిత్ షా సౌకర్యార్థమే ఎన్నికల కమిషన్ ఈ విధంగా తేదీలను ప్రకటించిందా అని మమత ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్..బీజేపీ కళ్లతో కాకుండా వెస్ట్ బెంగాల్ ని తమ సొంత రాష్ట్రంగా చూడాలని తాను కోరుతున్నానని మమత అన్నారు. కేంద్ర హోంమంత్రి దేశం కోసం పనిచేయాలని మమత అన్నారు. బెంగాల్ ఎన్నికల కోసం ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయకూడదని మమత అన్నారు.

ప్రధానిని తాము స్వాగతిస్తామని కానీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల కోసం ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయకూడదని మమత అన్నారు. ఒక రాష్ట్రం ఎన్నికల కోసం కేంద్రప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగపర్చకూడదన్నారు. ఒకవేళ వాళ్లు అలా చేస్తే అది పెద్ద పొరపాటన్నారు. దాని ఫలితాలను వారు అనుభవిస్తారన్నారు. తాము సామాన్య ప్రజలమని,తమ యుద్దాన్ని తాము చేస్తామన్నారు. డబ్బు దుర్వినియోగాన్ని ఆపాలని ఈసీని మమత కోరారు. బీజేపీ అన్ని జిల్లాలకు ఏజెన్సీల ద్వారా డబ్బును పంపిందని మమత అన్నారు.