Congress Infighting: కాంగ్రెస్ అధిష్టానంపై ఒక వర్గం నేతల అలక: ఉదయపూర్ తీర్మానాలు ఏమయ్యాయని ప్రశ్న

కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది

Congress Infighting: కాంగ్రెస్ అధిష్టానంపై ఒక వర్గం నేతల అలక: ఉదయపూర్ తీర్మానాలు ఏమయ్యాయని ప్రశ్న

Congressa

Congress Infighting: కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది. ఏ లాభం ఆశించకుండా పదవి కోసమే ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా..అధిష్టానం తమను పక్కన పెట్టడంపై కాంగ్రెస్ నేతలు అలకబూనారు. కాంగ్రెస్ ఏడు రాష్ట్రాల నుండి తన 10 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ విధేయులు మరియు ఎంపీలు పి చిదంబరం మరియు జైరాం రమేష్‌లను తిరిగి నామినేట్ చేస్తూ, G23 నాయకులు గులాం నబీ ఆజాద్ మరియు ఆనంద్ శర్మలకు బెర్త్‌లను నిరాకరించింది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా నుంచి పోటీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్టీ నేతలను తీసుకొచ్చింది.

other stories:Farooq Abdullah : నేడు ఈడీ ముందు హాజరు కానున్న ఫరూక్ అబ్దుల్లా

అయితే ఈ జాబితాలో చోటు దక్కక పోవడంపై పార్టీలో వర్గ చీలికలు ఏర్పడ్డాయి. పార్టీకి పరిమిత సంఖ్యలో రాజ్యసభ బెర్త్‌లు ఉన్నందున అందరినీ సంతోషంగా ఉంచలేమని అధిష్ఠానం చెబుతుండగా, ఉదయపూర్ ప్రకటన స్ఫూర్తిని అధిష్టానం తుంగలోకి తొక్కిందని అసంతృప్తితో ఉన్నవారు వాదిస్తున్నారు.ఉదయపూర్ తీర్మానంలో అతి ముఖ్యమైన పాయింట్ “ఒక కుటుంబానికి ఒకటే టికెట్”. అయితే పార్టీకి విధేయులుగా కొనసాగుతూ..సేవలు చేస్తున్న వారికి ఇందులో మినహాయింపు ఇవ్వడం సొంత పార్టీలోనే విమర్శలకు తావిచ్చింది.

other stories: TS Financial Crisis : ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ..ఉద్యోగుల జీతాలు..సంక్షేమ పథకాలకు డబ్బులు లేని దుస్థితి

ఈక్రమంలోనే సీనియర్ నేతలు పీ.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, యూపీ నేత ప్రమోద్ తివారి కుమార్తె ఆరాధన మిశ్రాకు కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వడంపై అధిష్టానం తీరుపై నేతలు మండిపడుతున్నారు. అధిష్టానం పాల్పడిన ఈ ఉల్లంఘనలు కాగితంపై ఉండకపోవచ్చు, కానీ ఆత్మ కించపరచబడిందని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే నేతల అలకను ముందే గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం..కఠిన నిర్ణయాలతోనే పార్టీ ముందుకు వెళ్తుందని భావిస్తోంది. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తూ కొత్త రక్తాన్ని ఆకర్శించాలన్న ఉదయపూర్ తీర్మానానికి కట్టుబడేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు ఉంటాయని మరొక నేత వెల్లడించారు.

other stories: YS Jaganmohan Reddy : విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సీఎం జగన్