TS Financial Crisis : ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ..ఉద్యోగులకు జీతాలు..సంక్షేమ పథకాలకు డబ్బులు లేని దుస్థితి

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ సతమతమవుతోంది. తెలంగాణకు రాబడి తగ్గటం, కొత్త అప్పులు పుట్టకపోవటంతో ఆర్థిక ఎమర్జన్సీ ఏర్పాడింది. ప్రస్తుతం ఉన్న అవసరాలు తీరటానికి కూడా సరిపడా డబ్బు ఖజానాలో లేకపోవటంతో తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది.

TS Financial Crisis : ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తెలంగాణ..ఉద్యోగులకు జీతాలు..సంక్షేమ పథకాలకు డబ్బులు లేని దుస్థితి

Financial Crisis Telangana

Financial Crisis Telangana: తెలంగాణ ధనిక రాష్ట్రం అని మంత్రులు చెబుతుంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ డబ్బులు లేక నానా తిప్పలు పడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ సతమతమవుతోంది. తెలంగాణకు రాబడి తగ్గటం, కొత్త అప్పులు పుట్టకపోవటంతో ఆర్థిక ఎమర్జన్సీ ఏర్పాడింది. ప్రస్తుతం ఉన్న అవసరాలు తీరటానికి కూడా సరిపడా డబ్బు ఖజానాలో లేకపోవటంతో తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఇక జూన్ నెల అవసరాలు ఎలా గడపాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. జూన్ నెల గడవాలంటే తెలంగాణకు రూ.20వేల కోట్లు అవసరం అవుతోంది. కేంద్రం తెలంగాణకు పెడుతున్న కొర్రీలతో పైసా అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలుపై ఈ ఆర్థిక సంక్షోభం తీవ్ర ప్రభావం పడనుంది. కేంద్రం తెలంగాణ విషయంలో అవలంభిస్తున్న తీరుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన చేస్తోంది. జూన్ 4లోపు తెలంగాణ విషయంలో కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరులో మార్పు రాకపోతే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.

జాతీయ రాజకీయాలంటూ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్న కేసీఆర్ కు చెక్ పెట్టటేలా కేంద్రం కేంద్రం చక్రం తిప్పుతోంది. కేంద్రం, ఆర్బీఐ నుంచి అప్పు పుట్టకుండా చేస్తోందన్న విమర్శలు టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ అధికారులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట కేంద్రంలోని మంత్రులు, అధికారులు. దీంతో తిరుగుముఖం పట్టిన కేసీఆర్ ఇప్పుడు జూన్ నెలను ఎలా వెళ్లదీస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది.తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా తర్వాత అతలాకుతలమైన రాష్ట్ర సర్కార్ కు ప్రతీ నెల ఒక గండంలా గడుస్తోంది. క్లిష్టమైన ఈ జూన్ నెలను కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది. జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలు, రైతు బంధుకు డబ్బులు వేయడం కేసీఆర్ సర్కార్ తలకు మించిన భారంగా మారింది. నిధుల సేకరణ కానకష్టంగా మారడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్ లోనే సుమారు రూ.20వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై సతమతమవుతోంది.

జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలకే సుమారు రూ.10వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతోపాటు వర్షాకాలం పంటకు ఇచ్చే రైతుబంధు కోసం రూ.7600 కోట్లు అవసరం అవుతాయని సమాచారం. మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల చెల్లింపు చాలా ఆలస్యమైంది. దీంతో ఈనెల అసలు చెల్లించడమే కష్టం అంటున్నారు.ఇక తెలంగాణకు వచ్చే ఆదాయం రోజురోజుకు భారీగా తగ్గుతోంది. ప్రధానంగా పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10వేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. వ్యయం మాత్రం దాదాపు రూ.20వేల కోట్లకు పైగానే ఉంది.

ఇక బాండ్ల విక్రయం ద్వారా రూ.4వేల కోట్లు సమీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నా కేంద్రం దానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటివరకూ కేవలం రూ.270 కోట్లకు మించి సమీకరించలేకపోయింది. దీంతో ఈనెల వేతనాలు, పింఛన్ల చెల్లింపులో తీవ్ర ఆలస్యం అయ్యేలా ఉంది. అదే జరిగితే కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లోనూ ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం.

కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా జాతీయ రాజకీయాలంటూ హంగామా చేస్తున్న కేసీఆర్ ను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అప్పుపుట్టకుండా చేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా పక్కా ప్లాన్ తో వెళుతోంది. సంక్షేమ పథకాలకు వేల కోట్లు పెట్టి ఇప్పుడు తెలంగాణను ఏపీ కంటే కూడా అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.