గవర్నమెంట్ ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్

  • Published By: nagamani ,Published On : November 28, 2020 / 04:49 PM IST
గవర్నమెంట్ ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్

Himachal Pradesh gov employee weekly one day work from home : కరోనా వల్ల ఇప్పటి వరకూ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లభించింది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.



క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న క్రమంలో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. శనివారం (నవంబర్ 28,2020) ఉదయం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
https://10tv.in/pm-modi-congratulations-to-the-bharat-biotech-team/


సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిదినాల‌కు సంబంధించి ఒక ముఖ్య‌ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి వారం ఐదు రోజులు మాత్ర‌మే ప్ర‌భుత్వ ఉద్యోగులు కార్యాల‌యాల‌కు వచ్చి వర్క్ చేయాలని మిగతా ఒకరోజు వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోం చేయాల‌ని సూచించారు.



హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎం ఆఫీసు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. కొవిడ్‌-19 చైన్‌ను బ్రేక్ చేయ‌డం కోసం డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ఈ ఒకరోజు వర్క్ ఫ్రం హోమ్ ను పద్ధతిని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్రకటించింది.



అలాగే ప‌ట్ట‌ణ ప్రాంతాలు ఎక్కువ‌గాగ‌ల సిమ్లా, మండి, కులు, కాంగ్రా జిల్లాల్లో ప్ర‌తిరోజు రాత్రి 9 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌నున్న‌ామని ప్రకటించింది.